ETV Bharat / entertainment

బాలయ్య సినిమాలో రాజశేఖర్​.. విలన్​గా కాదు ఆ పాత్రలో! - రాజశేఖర్​ బాలకృష్ణ సినిమా న్యూస్​

Balakrishna Anilravipudi movie: బాలయ్య-అనిల్​ రావిపూడి చిత్రంలో సీనియర్​ హీరో రాజశేఖర్​.. హాస్యం పండించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. సినిమాలో బాలయ్య స్నేహితుడిగా కనిపించి ఫుల్​ కామెడీ చేయబోతున్నారట. మరో విశేషమేమిటంటే.. ఒరిజినల్​ వాయిస్​లోనే ఆయన మాట్లాడనున్నారని సమాచారం.

Rajasekhar  Balakrishna Anil ravipudi movie
బాలయ్య సినిమాలో రాజశేఖర్​
author img

By

Published : Jun 20, 2022, 7:34 AM IST

Balakrishna Anilravipudi movie: తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ ఒకటి. ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాస్‌, క్లాస్‌ కథ ఏదైనా బాలకృష్ణ తనదైన శైలిలో నటించగలరు. ఇక మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తీయడంలో..'సరిలేరు నీకెవ్వరు'తో నిరూపించుకున్నారు అనిల్‌.

అయితే ఈ సినిమాలో సీనియర్​ హీరో రాజశేఖర్​.. విలన్​గా నటించనున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడా ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు ఈ కాంబో ఖరారైనట్లు తెలిసింది. రాజశేఖర్​ సరికొత్తగా కనిపించనున్నారట. బాలయ్య స్నేహితుడిగా, ఓ కామెడీ రోల్​ చేయబోతున్నారని అంటున్నారు. మరో విశేషమేమిటంటే.. ఈ మూవీలో ఆయన ఒరిజినల్​ వాయిస్​లోనే మాట్లాడి.. ఫుల్​ కామెడీ పండించనున్నారని.. ఓ వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, ఈ చిత్రం తండ్రీ కూతురు నేపథ్యంలో ఉంటుందని.. బాలయ్య కూతురిగా యువ హీరోయిన్​ శ్రీలీల కనిపించనుందని సమాచారం. ఇక ముందెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌లో బాలకృష్ణ కనిపించనున్నారట.

ఇదీ చూడండి: మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ కాంబో.. ట్రైలర్‌ అదరహో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.