ETV Bharat / entertainment

'నాటు నాటు'కు ఆస్కార్​.. భార్య, కొడుకుతో రచ్చ చేసిన రాజమౌళి! - ఆర్​ఆర్​ఆర్​ నాటు నాటు సాంగ్​

ఆర్​ఆర్​ఆర్​ నాటు నాటు సాంగ్​కు ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు దర్శకుడు రాజమౌళి. ఈ వేడుకలో జక్కన్న.. సంతోషంగా భార్య, కొడుకుతో కలిసి కేరింతలు కొడుతూ రచ్చ రచ్చ చేశారు. అలానే ఆస్కార్ రావడంపై మాట్లాడారు. ఏం అన్నారంటే..

Rajamouli
'నాటు నాటు'కు ఆస్కార్​.. భార్య, కొడుకుతో రచ్చ చేసిన రాజమౌళి!
author img

By

Published : Mar 13, 2023, 12:04 PM IST

Updated : Mar 13, 2023, 1:09 PM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ ఆడియెన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఆస్కార్‌' అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక గ్రాండ్​గా జరిగింది. సినీ తారలు హాజరై సందడి చేశారు. ఇక ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' చిత్రం ఏకంగా ఏడు అవార్డులను అందుకుని ప్రత్యేకంగా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్​, బెస్ట్ మూవీ, బెస్ట్​ యాక్టర్​ అవార్డులు ఆ చిత్రానికే వరించాయి. ఇకపోతే భారత్​ నుంచి నామినేట్‌ అయిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' బెస్ట్​ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో 'నాటు నాటు' పాటకు ఆస్కార్‌ వరించింది. అలానే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' అవార్డును దక్కించుకుంది.

అయితే ఈ ఆస్కార్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ తెగ సంబరపడిపోయారు. అలాగే ఆస్కార్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన జక్కన్న.. అవార్డు ప్రకటించగానే ఆనందంతో గెంతులేశారు. ఆయనతో పాటు భార్య రమ, కుమారుడు కార్తికేయ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ లైక్స్, కామెంట్స్​ పెడుతున్నారు.

ఇక అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత జక్కన్న మాట్లాడుతూ.. "నిజంగా ఇది కలలానే ఉంది. అయితే అవార్డు వస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. మీ జీవితంలో అత్యంత అమూల్య క్షణం మీ చిత్రం అవార్డును సాధించడమా? లేదా ఆస్కార్ వేదికపై మీ చిత్రంలోని పాటను ప్రదర్శించడమా అని అడిగితే, సెలెక్ట్​ చేసుకోవడం నిజంగా నాకు కష్టమే. కానీ ఈ రెండింటినీ చూడటం ఎంతో సంతోషంగా ఉంది. పాట ప్రదర్శించినంత సేపు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం.. పూర్తయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చూస్తే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నన్ను నిలబెట్టినట్లు అనిపించింది. అలాగే ఆస్కార్ అవార్డు కీరవాణిని శిఖరాగ్రాన నిలబెట్టింది" అని రాజమౌళి తెగ మురిసిపోయారు.

ఇక ఇదే వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్​ కూడా ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో తనతో కలసి దూకిన పులి ఇదే.. అంటూ ఈ వేడుకలో ఎన్టీఆర్‌ మీడియాతో సరదాగా మట్లాడారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఓ రిపోర్టర్‌ తారక్​ ధరించిన డ్రెస్‌ గురించి అడగ్గా.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చినట్టు చెప్పుకొచ్చారు.

రామ్​చరణ్​ మాట్లాడుతూ.. "మా లైఫ్​లోనే కాకుండా ఇండియన్​ సినీ ఇండస్ట్రీలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎంతో ప్రత్యేకమైనది. 'ఆస్కార్‌' అవార్డు మాకు దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేనింకా కలలోనే ఉన్న భావన కలుగుతోంది. రాజమౌళి, కీరవాణి.. ఇండియన్ సినిమాలో అత్యంత విలువైన రత్నాలు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. వరల్డ్​ వైడ్​గా 'నాటు నాటు' సాంగ్ అనేది ఓ ఎమోషనల్​. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్‌, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా బ్రదర్‌ తారక్​, కో-స్టార్‌ అలియాభట్​కు ధన్యవాదాలు. ఎన్టీఆర్​.. నీతో మళ్లీ డ్యాన్స్‌ చేసి రికార్డ్స్‌ సృష్టించాలని భావిస్తున్నా. ఇండియన్ యాక్టర్స్​ అందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అని చరణ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'నాటు నాటు' సాంగ్.. ఈ ఆసక్తికర విషయాలను మీరు గమనించారా?

Last Updated : Mar 13, 2023, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.