Rajamouli Mahesh Babu Movie : 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అన్నది స్పష్టత లేదు. దీనిపై మూవీటీమ్ మౌనం పాటిస్తోంది. అయితే రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు అయిన కీరవాణి ఈ విషయంపై మాట్లాడారు.
తన కొత్త చిత్రం 'నా సామి రంగ' ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు రాజమౌళి - మహేశ్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఆయన తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఈ సినిమా గురించి అడిగేందుకు రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని చమత్కరించారు. "మహేశ్ సినిమా గురించి తెలుసుకోవాలంటే రాజమౌళికి ఫోన్ చేసి అడగాలి. కానీ తనకు ఫోన్ చేస్తే అది స్విచ్చాఫ్‌లో ఉంటోంది. అంటే ఇంకా పని నా వరకు రాలేదని అర్థం." అని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan Hari Hara Veera Mallu : ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా నడుస్తోందని.. పవన్ సినిమాకు సంబంధించి మూడు సాంగ్స్ పూర్తయ్యాక బ్రేక్ వచ్చిందని, మళ్లీ దర్శకుడు క్రిష్ అడిగినప్పుడు ఈ సినిమా పని మొదలు పెడతానని చెప్పారు. "‘హరి హర వీరమల్లు చిత్ర విషయానికొస్తే ప్రస్తుతానికి మూడు పాటలు రికార్డు చేశాం. చిరంజీవి సినిమా ఈ మధ్యే షూటింగ్ మొదలైంది. దానికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ మొదలైంది" అని అన్నారు.
నాగార్జున 'నా సామి రంగ' చిత్రానికి సంబంధించి మ్యూజిక్ ఔట్పుట్ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు కీరవాణి. తాను గతంలో నాగార్జునతో కలిసి చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఎలాంటి విజయాన్ని అందుకుందో ఇదీ అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
-
So proud of my Peddanna...!!!🤗 pic.twitter.com/H3k07KsnmZ
— rajamouli ss (@ssrajamouli) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">So proud of my Peddanna...!!!🤗 pic.twitter.com/H3k07KsnmZ
— rajamouli ss (@ssrajamouli) April 6, 2023So proud of my Peddanna...!!!🤗 pic.twitter.com/H3k07KsnmZ
— rajamouli ss (@ssrajamouli) April 6, 2023
'గుంటూరు కారం' ట్రైలర్ క్రేజ్- 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్- సలార్ రికార్డ్ బ్రేక్
'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు విశేష స్పందన- 'ETV WIN'లో రికార్డ్స్ బ్రేక్!