ETV Bharat / entertainment

రాజాసాబ్ స్టోరీ లీక్!- వైరల్​గా మారుతి రియాక్షన్ ట్వీట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 5:50 PM IST

Updated : Jan 17, 2024, 5:58 PM IST

Raja Saab Story Leaked: రెబల్​స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' సినిమా స్టోరీ లీక్ అయ్యింది. దీనిపై డైరెక్టర్ మారుతి స్పందించి ఓ ట్వీట్ చేశారు.

raja saab story
raja saab story

Raja Saab Story Leaked: 'సలార్' సినిమాతో హిట్ అందుకున్న పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నెక్ట్స్​ ప్రాజెక్ట్​లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' ఫస్ట్ లుక్​ పోస్టర్​ను మేకర్స్ రీసెంట్​గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్​లో కనిపించనున్నారు. లుంగీలో ఉన్న ప్రభాస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే సినిమా ఇన్ఫర్మేషన్​ వెబ్​సైట్ ఐఎమ్​డీబీ (IMDB) ఈ సినిమా స్టోరీ లైన్​ను చెప్పేసింది. దీనిపై డైరెక్టర్ మారుతి స్పందించారు. ట్విట్టర్​లో దీనిపై రిప్లై ఇచ్చారు.

'ప్రేమలో పడిన జంటకు దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలు, విధిని ఎదిరించి వారు పోరాడటం వంటి అంశాలతో 'రాజా సాబ్‌' తెరకెక్కనుందని 'ఐఎమ్‌డీబీ' పేర్కొంది. అయితే ఈ స్క్రీన్ షాట్​ను పోస్ట్ చేస్తూ మారుతి ఓ ట్వీట్ చేశారు. 'అరెరే నాకు ఈ స్టోరీలైన్‌ గురించి తెలియక మరో స్క్రిప్ట్‌తో సినిమా తీస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నా స్క్రిప్ట్‌ను అంగీకరిస్తుందో లేదో' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

  • Ararare I don't know this plot
    So shooting with different script

    Ippudu IMDB Samajam accept chestada mari 😁 pic.twitter.com/gCr2gNEybV

    — Director Maruthi (@DirectorMaruthi) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినిమా విషయానికొస్తే: ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందట. కానీ, మూవీటీమ్ ఈ విషయాన్ని సీక్రెట్​గా ఉంచిందని సమాచారం. రాజాసాబ్​లో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ఇండియా లెవెల్​లో ఈ సినిమా రూపొందుతోంది.

  • Probably the best #Sankranthi I'm having :)
    It's official now... presenting #TheRajaSaab to all of you 🤗🤗
    Need all of ur blessings ♥️

    Chaala days nunchi, eppudu eppudu ani waiting. Finally it happened today. Darling ni ela chudali anukunnaro… ala choodabotunnaru… Promise !!… pic.twitter.com/02nkHBbpk3

    — Director Maruthi (@DirectorMaruthi) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Prabhas Kalki 2898 AD: మరోవైపు డార్లింగ్ నాగ్​ అశ్విన్​ డైరెక్షన్​లో 'కల్కి 2898 AD' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2024 మే 9న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు రీసెంట్​గా మేకర్స్ ప్రకటించారు. కాగా, సైన్స్ ఫిక్షన్ జానర్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై అశ్వనీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'రాజాసాబ్​'గా ప్రభాస్- కొత్త లుక్​లో డార్లింగ్ అదుర్స్

దుర్గామాత ఆలయానికి ప్రభాస్- 'సలార్' నిర్మాతతో కలిసి స్పెషల్ పూజలు

Last Updated : Jan 17, 2024, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.