ETV Bharat / entertainment

Pushpa 2 Update : 'పుష్ప-2' రిలీజ్​ మరింత ఆలస్యం​!.. కారణం అదేనా? - అల్లు అర్జున్ తదుపరి సినిమా

Pushpa 2 The Rule Release Date : 'పుష్ప' సినిమాతో పాన్​ ఇండియా రేంజ్​లో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్​. దీంతో 'పుష్ప2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఆ వివరాలు..

Pushpa 2 The Rule Release Date
Pushpa 2 The Rule Release Date
author img

By

Published : May 25, 2023, 10:52 AM IST

Updated : May 25, 2023, 11:14 AM IST

Pushpa 2 The Rule Release Date : అల్లు అర్జున్‌, రష్మిక నటించిన యాక్షన్​ ఎంటర్​టైనర్ 'పుష్ప'. ఈ సినిమా పాన్​ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోట్లు వసూళ్లు చేసి విదేశాల్లోనూ సత్తా చాటింది. ఈ సినిమాకు సీక్వెల్​గా పార్ట్ 2 (పుష్ప 2: ది రూల్​)ని అనౌన్స్ చేశారు మేకర్స్​. ఇటీవల ప్రముఖ మలయాళీ నటుడు ఫాహద్​ ఫాజిల్​ షూటింగ్​ లకేషన్​లో ఉన్న ఫొటోను విడుదల చేసింది చిత్ర బృందం. అంతకుముందు, 'వేర్​ ఈజ్​ పుష్ప' అని ఓ ప్రచార వీడియో విడుదల చేసింది. అనంతరం ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో 'పుష్ప-2' ఎప్పుడు విడులవుతుందా? అని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను ఈ ఎడాది​ డిసెంబర్​ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్​ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆ టైమ్​కు కూడా ఈ మూవీ రిలీజ్​ కష్టమేననే సంకేతాలు వెలువడుతున్నాయి.

ప్రతి ఫ్రేమ్​లో పర్ఫెక్షన్ చూపించే దర్శకుడు సుకుమార్​.. ఈ సినిమా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారట. మొదటి పార్ట్​కు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగానే ఆదరాబాదరాగా సినిమాను పూర్తి చేసేందుకు సుకుమార్​ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మే 2024 వరకు విడుదల కాకపోవచ్చని ప్రచారం సాగుతోంది. 2024 మే, జులై విండోలో ఈ సినిమాను రిలీజ్​ చేసే ఆలోచనలో చిత్రం బృందం ఉందని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్​, సుకుమార్​ రైటింగ్స్​ బ్యానర్లపై.. వై రవిశంకర్, నవీన్​ యేర్నేని​ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్​, రష్మికతో పాటు ఫాహద్​ ఫాజిల్​, రావు రమేశ్, సునీల్, అనసూయ భరద్వాజ్​ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

బన్నీ-త్రివిక్రమ్​ కాంబో..
'పుష్ప-2' తర్వాత బన్నీ-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో మరో సినిమా తెరకెక్కనుందని ఇటీవల నిర్మాత బన్నీవాస్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రెగ్యులర్​ చిత్రీకరణ 2024లో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్​, యాక్షన్ డ్రామా జోనర్​లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌తో క‌లిసి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు బన్నీవాస్ ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.

ఇప్పటికే అల్లు అర్జున్-త్రివిక్రమ్​ల కాంబినేషన్​లో వచ్చిన 'జులాయి', 'సన్​ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో' సినిమాలు బ్లాక్​ బస్టర్​గా నిలిచాయి. బాక్సాఫీస్​ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి. 'అల వైకుంఠపురంలో అయితే నార్త్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. ఇక బన్నీవాస్ చేసిన ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకండా పోయాయి.

Last Updated : May 25, 2023, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.