ETV Bharat / entertainment

ప్రాజెక్ట్​-కె మూవీ మేకర్స్ షాకింగ్ న్యూస్.. ఫ్యాన్స్​కు ఎదురుచూపులు తప్పవా? - కల్కి 2898 ఏడీ రిలీజ్​ డేట్​

గ్లింప్స్​ చూసినప్పటి నుంచి 'కల్కి 2898 ఏడీ' ఎప్పుడు రిలీజవుతుందంటూ అభిమానులు వేయకళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో మూవీ మేకర్స్​ గట్టి షాక్​ ఇచ్చేలా కనిపిస్తున్నారట. ఇంతకీ అదేంటంటే..

prabhas-kalki-2898-ad
prabhas-kalki-2898-ad
author img

By

Published : Jul 25, 2023, 5:53 PM IST

Kalki 2898 AD Release Date : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. వైజయంతి మూవీస్ బ్యానర్​లో రూపొందుతున్న ఈ సినిమాకు 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఇప్పటికే కామిక్​ కాన్​ వేదికగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే దేశ విదేశాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో ప్రభాస్​ లుక్స్​తో పాటు పలు అంశాలను చిత్రీకరించిన తీరు ఆడియెన్స్​ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అంటూ అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో మూవీ యూనిట్​ ఓ షాకింగ్ న్యూస్​ను ఇచ్చేలా ఉందని సినీ వర్గాలు గుసుగసలాడుతున్నాయి. మూవీని అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగానే రిలీజ్ చేస్తారనే టాక్ నెట్టింట తెగ వినిపిస్తోంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా అప్పుడేనా ?
Project K Release Date : అప్పట్లో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్​ చేయనున్నట్లు చిత్ర యూనిట్​ ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విడుదల తేదీను మార్చే ఆలోచనల్లో ఉన్నారట. ఈ క్రమంలో అనుకున్న తేదీ కంటే మరో నాలుగు నెలలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారట. అందుకే జనవరిలో కాకుండా ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తేదీ కూడా మే 9గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

స్టోరీ అదేనా?
Project K Story : అమెరికాలోని కామిక్​కాన్​ వేదికగా తాజాగా సినిమాకు సంబంధించిన ఓ పార్ట్​ను కామిక్​ వెర్షన్​లో రిలీజ్​ చేశారు. దీన్ని చూస్తుంటే కథ మొత్తం ఇట్టే అర్థమైపోతోందని నెటిజన్లు అంటున్నారు. వివిధ యుగాల్లో దుష్ట‌శిక్ష‌ణ కోసం శ్రీ మ‌హా విష్ణువు అనేక‌ అవతారాలు ఎత్తారు. అందులో భాగంగానే కలియుగం అంతంలో కల్కిగా అవతారంగా కనిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 'కల్కి 2898 ఏడీ' తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినపుడు ప్రభాస్ ప్రపంచాన్ని కాపాడే ఆశాకిరణం కల్కి లా వస్తారని గ్లింప్స్ వీడియోలో చూపించారు. ప్రపంచాన్ని జ‌యించ‌డానికి ఆధునిక ఆయుధాల‌ను సంపాదించుకోవాల‌ని దుష్ట‌శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తుంటాయి. వారిని క‌ల్కి ఎలా అడ్డుకుంటున్నాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ అని స‌మాచారం. సుమారు రూ.600 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా. ఇండియాలో అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో ఒకటిగా పేరుందుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.