Project K Car Rally : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి' ముందు ఆయన ఫాలోయింగ్ రీజనల్ వరకే పరిమితం ఉండగా.. ఆ ఒక్క సినిమాతో ఆయన దశనే మారిపోయింది. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో జీరో హేట్రెడ్ ఉన్న హీరోల్లో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'ఆదిపురుష్' సినిమాలో మెరిసిన ఆయన.. ఆ తర్వాత 'ప్రాజెక్ట్-K'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా కంటే ముందు నుంచే మూవీ టీమ్ ఓ వైపు షూటింగ్‌తో పాటు సినిమా ప్రమోషన్ల విషయంలో జోరుగా చూపిస్తోంది.
ఇటీవలే 'ప్రాజెక్ట్-కె' టైటిల్‌ను అమెరికాలోని లోని శాన్ డియాగో కామిక్ కాన్ అనే పేరిట జరిగే ఈవెంట్లో ఆవిష్కరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 20న జరిగే ఈ వేడుక కోసం కమల్‌హాసన్, ప్రభాస్ , దీపికా పదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ అమెరికాకు హాజరవ్వనున్నారు. ఇక ప్రభాస్ అయితే అప్పుడే యూఎస్‌కు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ స్వీట్ సర్ప్రైజ్ను ఏర్పాటు చేశారు.
-
The men have landed in the USA 🇺🇸. See you in San Diego on July 20th.#Prabhas @RanaDaggubati #ProjectK #WhatisProjectK pic.twitter.com/lclZRo4Srp
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The men have landed in the USA 🇺🇸. See you in San Diego on July 20th.#Prabhas @RanaDaggubati #ProjectK #WhatisProjectK pic.twitter.com/lclZRo4Srp
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023The men have landed in the USA 🇺🇸. See you in San Diego on July 20th.#Prabhas @RanaDaggubati #ProjectK #WhatisProjectK pic.twitter.com/lclZRo4Srp
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023
Prabhas Fans Rally : యూఎస్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక చోటుకు చేరుకున్నారు. ప్రాజెక్ట్ కె టీ షర్ట్స్ ధరించి రోడ్లపై భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ బ్యానర్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
-
A BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from St. Louis, USA🇺🇸 for organizing the #ProjectK Car Rally!💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).#WhatisProjectK @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/ssHM6s2kgk
">A BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from St. Louis, USA🇺🇸 for organizing the #ProjectK Car Rally!💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).#WhatisProjectK @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/ssHM6s2kgkA BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from St. Louis, USA🇺🇸 for organizing the #ProjectK Car Rally!💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).#WhatisProjectK @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/ssHM6s2kgk
Project K Cast : 'ప్రాజెక్ట్ కె' సినిమా విషయానికి వస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటు అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">