'గ్యాంగ్‌లీడర్' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అదేంటంటే.. దర్శకుడు నెల్సన్ దిలీప్-ప్రియాంక మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ డాక్టర్ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందని ప్రచారం సాగుతోంది.
నెల్సన్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం 'జైలర్'. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తోంది. అయితే తమన్నా కన్నా ముందే ఈ పాత్ర కోసం ప్రియాంకను అనుకున్నారట. కానీ నెల్సన్‌తో జరిగిన ఓ చిన్న వివాదం వల్ల ప్రియాంక ఈ రోల్‌కు నో చెప్పిందట. దీంతో తమన్నాను తీసుకున్నారని తెలిసింది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్‌మీడియాలో ఇలా వార్తలు వస్తున్నాయి.
ఇదీ చూడండి: రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ