ETV Bharat / entertainment

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష

Prime Minister Narendra Modi congratulates Ilaiyaraaja, pt usha, vijayendra prasad  on being nominated to the Rajya Sabha
రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష
author img

By

Published : Jul 6, 2022, 8:30 PM IST

Updated : Jul 6, 2022, 10:49 PM IST

20:27 July 06

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.

రాజ్యసభకు ఎంపికైన వారికి ట్విట్టర్​ వేదికగా.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. విజయేంద్రప్రసాద్‌ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించినట్లు మోదీ పేర్కొన్నారు.

" విజయేంద్రప్రసాద్‌ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇళయరాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచింది. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం. పి.టి.ఉష జీవితం.. ప్రతి భారతీయుడికి ఆదర్శం. అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారులను పి.టి.ఉష తయారుచేశారు"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ ఎంపిక కావడం పట్ల.. తెలుగు సినీ రచయుతల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

" మా తెలుగు సినీ రచయుతల సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మన బాహుబలి విజయేంద్ర ప్రసాద్​ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైన అభినందనలు."

- డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, అధ్యక్షులు, ఉమార్జీ అనూరాధ ప్రధాన కార్యదర్శి, తెలుగు సినీ రచయితల సంఘం

విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల మెగాస్టార్​ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇళయరాజా ఎంపిక పట్ల సూపర్​స్టార్​ రజనీకాంత్​ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆలియా భట్​ ప్రెగ్నెంట్ అని తెలిసి.. కన్నీరు పెట్టుకున్న కరణ్​ జోహార్​

Last Updated : Jul 6, 2022, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.