ETV Bharat / entertainment

Premam Director Health : 'ప్రేమమ్' డైరెక్టర్​ షాకింగ్​ డెసిషన్.. ఆ వ్యాధి వల్ల సినిమాలకు గుడ్​ బై - Alphonse Puthren announces exit from films

Premam Director Health : మలయాళ క్లాసిక్ హిట్ చిత్రం ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ షాకింగ్ విషయాన్ని తెలిపారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపిన ఆయన.. సినిమాలకు గుడ్​ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

Premam Director Health : 'ప్రేమమ్' డైరెక్టర్​ షాకింగ్​ న్యూస్​​.. ఆ వ్యాధి వల్ల సినిమాలకు గుడ్​ బై

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 1:47 PM IST

Premam Director Health : మలయాళ ఇండస్ట్రీ బెస్ట్‌ లవ్​ స్టోరీస్​ మూవీస్​లో ప్రేమమ్‌ చిత్రం ఒకటి. నివీన్ పౌలీ, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్‌ కలిసి నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ డూపర్‌ క్లాసిక్​ హిట్‌గా నిలిచింది. యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించింది డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్. సినిమా ఫీల్ గుడ్ మూవీగా అద్భుతంగా ఉండటం వల్ల.. ప్రతి ఒక్కరు అల్ఫోన్స్​ వర్క్​కు ఫిదా అయిపోయారు. అయితే ఆయన ఆ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పూర్తిగా బక్కచిక్కిపోయి నెరిసిన గడ్డంతో ఎవరూ గుర్తుపట్టనంతగా మారిపోయారు. అనంతరం ఆయన ఆరోగ్యం గురించి మళ్లీ ఎటువంటి సమాచారం అందలేదు.

Premam Director Good Bye To Movies : తాజాగా ఆయన ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. సినిమా కెరీర్​కు గుడ్​ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. "నేను నా సినిమా థియేటర్​ కెరీర్​ను ఆపేస్తున్నాను. ఆటిసమ్​ స్పెక్ట్రమ్​ డిస్​ ఆర్డర్​తో బాధపడుతున్నాను. నేను ఎవరికీ బర్డెన్​గా ఉండాలనుకోవడం లేదు. సాంగ్, వీడియోస్​, షార్ట్ ఫిల్మ్స్​ వరకు మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ చేస్తాను. నిజానికి సినిమాను బంద్ చేయాలని లేదు. కానీ వేరే అవకాశం లేదు. నేను చేయలేని పని గురించి ప్రామిస్​లు​ చేయలేను. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు జీవతంలో ఇంటర్వెల్​ పంచ్​ లాంటి ట్విస్ట్​ ఇలా ఎదురౌతుంది" అంటూ రాసుకొచ్చారు.

ఈ పోస్ట్​ ఆయన చేసిన వెంటనే సోషల్​ మీడియాలో ఫుల్​ వైరల్​గా మారిపోయింది. కానీ ఈ పోస్ట్​ను అల్ఫోన్స్​ వెంటనే డిలీట్ చేశారు. కానీ దాన్ని అప్పటికే అందరూ చూసేశారు. మరి ఎందుకు పోస్ట్​ పెట్టి.. తీసేశారో తెలియలేదు. కాగా, అల్ఫోన్స్​.. 'నేరమ్' చిత్రంతో అరంగేట్రం చేశారు. ఇందులో నివిన్ పౌలీ, నజ్రియా, బాబీ సింహా నటించారు. ఈ చిత్రం తమిళంలో కూడా రిలీజై మంచి ప్రశంసలను అందుకుంది. అనంతరం ఆయన చేసిన 'ప్రేమమ్'​​ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇది సూపర్ క్లాసిక్ హిట్​గా నిలిచింది. అనంతరం 'అవియల్' అనే షార్ట్ ఫిల్మ్​ చేశారు. ప్రేమమ్​ తర్వాత ఏడేళ్లు గ్యాప్​ ఇచ్చి 'గోల్డ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ ఏడాది తమిళంలో 'గిఫ్ట్' అనే షార్ట్ ఫిల్మ్ చేశారు.

Pindam Movie Teaser : 'ది స్కేరియస్ట్ ఫిల్మ్'.. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. భయపెట్టేలా టీజర్​..

This week movie Releases : ఈ వారం థియేటర్​/ఓటీటీలో 13 సినిమాలు.. నవ్విస్తూనే భయపెట్టేలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.