ETV Bharat / entertainment

ఉపాసనకు ఊహించని బహుమతి.. పుట్టబోయే బిడ్డ కోసం.. - Ram charan upcoming movies 2023

Upasana kamineni and Ram Charan baby : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసనకు ఓ ఊహించని బహుమతి అందింది. ఆ గిఫ్ట్​ను ఆమె సోషల్​మీడియా వేదికగా పంచుకున్నారు.

Upasana
ఉపాసనకు ఊహించని బహుమతి.. పుట్టబోయే బిడ్డ కోసం..
author img

By

Published : Jun 17, 2023, 3:29 PM IST

Updated : Jun 17, 2023, 3:46 PM IST

Upasana kamineni and Ram Charan baby : టాలీవుడ్​ స్టార్​ కపుల్స్ రామ్‌ చరణ్‌, ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు పెళ్లైన దాదాపు పదేళ్ల తర్వాత సంతానం కలగనుంది. త్వరలోనే మెగా వారసుడు లేదా వారసురాలు ఆ ఇంటికి రాబోతున్నారు. దీని కోసం ఆ కుటుంబంతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సోషల్​మీడియా ఇన్​స్టాలో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలను షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ సంస్థ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతను దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.

సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన చెప్పారు. వారు తయారు చేసిన ఈ ఊయల.. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. "అతి త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం. నా బిడ్డ కోసం మీరు చేతితో తయారు చేసి ఇచ్చిన ఈ ఊయల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావిస్తున్నాను. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం ఆశకు ప్రతీకగా నా బిడ్డకు గుర్తుండిపోతుంది. మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు" అని ఉపాసన రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు కొందరు కామెంట్స్​ చేస్తున్నారు. మరి కొందరు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, ఈ ఏడాది జులైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనున్నారు.

Ram charan upcoming movies 2023 : రామ్​చరణ్​ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్​తో కలిసి పాన్​ ఇండియా స్థాయిలో 'గేమ్​ ఛేంజర్' అనే ఓ భారీ బడ్జెట్​ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్​. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్​పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత 'ఉప్పెన' ఫేమ్​​ బుచ్చిబాబుతో కలిసి 'ఆర్​సీ 16'కు రామ్​ చరణ్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. శంక‌ర్​తో సినిమా పూర్తి కాగానే ఈ కొత్త చిత్రాన్ని సెప్టెంబ‌ర్​లో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో చరణ్​ ఓ ప్లేయర్​గా కనిపించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీలో ఇంకా హీరోయిన్​ ఫైనల్​ కాలేదు.

ఇదీ చూడండి :

Ram Charan Upasana Love : చెర్రీ-ఉప్సీ 'లవ్'​ స్టోరీ అక్కడ మొదలైందా ?

గ్రాండ్​గా ఉప్సీ బేబీ షవర్​ పార్టీ.. బన్నీ, సానియా, మంచు లక్ష్మి సందడి మామూలుగా లేదుగా!

Last Updated : Jun 17, 2023, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.