Project K Movie Updates : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె' ఒకటి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. థర్డ్ వరల్డ్ వార్(మూడో ప్రపంచ యుద్ధం) నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సూపర్ హీరో మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడీ చిత్రంలో మరో బడా స్టార్ జాయిన్ అవ్వబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అదేంటంటే.. ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్‌గా నటించబోతున్నారట. దీనికోసం ఆయన రూ.150 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ సినీ ప్రియులు మాత్రం సర్ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా 70ఏళ్ల వయసులోనూ హీరోగా పీక్ స్టేజ్‌లో ఉన్నారు.
Kamalhassan new project : ఆయన రీసెంట్గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్, గ్యాంగ్‌స్టర్ మూవీ 'విక్రమ్' బాక్సాఫీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.500 కోట్ల వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి భారీ సినిమా 'ఇండియన్ 2' చేస్తున్నారు. ఇది కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకొన్ని సినిమాలను లైన్లో పెడుతున్నారు. అలా కెరీర్ పీక్ స్టేట్‌లో హీరోగా నటిస్తున్న సమయంలో నిజంగానే కమల్.. ఈ నెగటివ్ రోల్‌కు ఒప్పుకున్నారా లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ వార్తపై మేకర్స్ స్పష్టత ఇస్తారో లేదో చూడాలి.
Project K News : కాగా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కే చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం. మునుపెన్నడు చూడని అతిపెద్ద భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కించనున్నారట. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక్క సినిమా కూడా రాలేదని.. సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులు గతంలో ఎన్నడూ కలుగని థియేట్రికల్ అనుభూతిని దీని ద్వారా పొందుతారని మేకర్స్ అంటున్నారు.
ఇదీ చూడండి :
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 7 నెలల్లో మూడు సినిమాలు.. 'ప్రాజెక్ట్-K' రిలీజ్ ఎప్పుడంటే?
అంతర్జాతీయ స్టంట్ టీమ్‌తో 'భారతీయుడు 2' ఫైట్స్.. రిలీజ్ అప్పుడేనా..?