ETV Bharat / entertainment

'ప్రభాస్​ను ఇలా ఎప్పుడూ చూసుండరు - ఫస్ట్​ టైమ్​ అలా కనిపించనున్నారు' - ప్రభాస్ స్పిరిట్ రోల్

Prabhas Spirit Character : టాలీవుడ్ స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్​ ప్రస్తుతం 'సలార్' జోష్​లో ఉన్నారు. వరల్డ్​ వైడ్​ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. మరోవైపు ఆయన ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రాజెక్టులకు సైన్ చేశారు. అందులో సందీప్​ రెడ్డి తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' ఒకటి. అయితే తాజాగా ఈ మూవీలో ప్రభాస్​ క్యారెక్టర్​ గురించి నిర్మాత ప్రణయ్​ రెడ్డి ఓ సాలిడ్ అప్​డేట్ ఇచ్చారు. ఇంతకీ అదేంటంటే ?

Prabhas Spirit Character
Prabhas Spirit Character
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 3:08 PM IST

Updated : Dec 27, 2023, 4:28 PM IST

Prabhas Spirit Character : రెబల్ స్టార్ ప్రభాస్​ ప్రస్తుతం 'సలార్' సక్సెస్​ను ఆస్వాదిస్తూ బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తున్నారు. తన నటనతో ఇటు టాలీవుడ్​లోనే కాకుండా అటు బాలీవుడ్​లోనూ ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆయన అప్​కమింగ్ మూవీస్​పై ఆసక్తి నెలకొంది. అందులో ఆయన క్యారెక్టరైజేషన్​ ఎలా ఉండనుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఇప్పటికే నాగ్​అశ్విన్​ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్​ ఓ స్ట్రాంగ్​ రోల్​లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్​ ద్వారా ఆయన క్యారెక్టర్​ ఎలా ఉండనుందో అందరికీ తెలిసింది.

అయితే యానిమల్ తర్వాత డైరెక్టర్​ సందీప్​ రెడ్డి 'స్పిరిట్' అనే సినిమాను తెరకెక్కించనున్నారు. అందులో ప్రభాస్​ లీడ్ రోల్​లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ సాలిడ్​ అప్​డేట్​ను సందీప్‌ సోదరుడు నిర్మాత ప్రణయ్‌ రెడ్డి ఇచ్చారు.

"ప్రభాస్‌ తన కెరీర్‌లోనే మొదటి సారి పోలీస్‌ డ్రెస్‌లో కనిపించనున్నారు. సందీప్ గత సినిమాల్లో హీరోల క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో స్పిరిట్​ సినిమాలోనూ ప్రభాస్‌ పాత్ర అలానే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆయన ఓ యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా కనిపిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హీరోకు సంబంధించిన విషయాలు మాత్రమే నేను చెప్పగలను" అంటూ డార్లింగ్ ఫ్యాన్స్​కు హింట్​ ఇచ్చారు. ఇది విన్న ఫ్యాన్స్ ఈ సినిమా తదుపరి అప్​డేట్స్​ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్​ లుక్​ చూసేందుకు వెయిట్​ చేస్తున్నారు.

ఇటీవలే 'యానిమల్' ప్రమోషన్స్​ కోసం మూవీ టీమ్​ బాలకృష్ణ 'అన్​స్టాపబుల్'​ షో లో సందడి చేసింది. ఈ ప్రోగ్రామ్​లో సందీప్ వంగ, 'స్పిరిట్' సినిమా షూటింగ్ అప్​డేట్ ఇచ్చారు. ప్రోగ్రామ్​ హోస్ట్ నందమూరి బాలకృష్ణ, సందీప్​ను స్పిరిట్ ఎప్పుడమ్మా? అని అడగ్గా.. 2024 సెప్టెంబర్​లో స్టార్ట్​ అవుతుదంటూ ఆయన సమాధానమిచ్చారు. ఇక దర్శకుడు సందీప్ తెలుగులో తీసే సినిమాల్లో నటించడానికి ఇష్టపడతానని హీరో రణ్​బీర్ అన్నారు. 'సందీప్ నెక్ట్స్​ ఫిల్మ్​ ప్రభాస్ అన్నతో ఉంది. అందులో నాకు చిన్న రోల్​ ఇస్తే నేను నటించడానికి సిద్ధం' అని అన్నారు.

'ప్రభాస్​ సినిమా అంటే ఆ మాత్రం ఎక్స్​పెక్టేషన్స్ ఉండాలి మరి'

15ఏళ్ల క్రితమే స్టోరీ లైన్​- 1000మందితో 'దేవ' ఫైట్​- ప్రభాస్, శ్రుతి సాంగ్​- సలార్​ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్​ ఇవే!

Last Updated : Dec 27, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.