Salaar Teaser : అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రభాస్ 'సలార్' టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రచార చిత్రాన్ని జులై 6న ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రభాస్ యాక్షన్ పోస్టర్‌ను కూడా ఇప్పుడు విడుదల చేశారు. ఇందులో ప్రభాస్.. శత్రువు గుండెలో ఆయుధాన్ని దించుతూ కనిపించారు. అయితే ఆయన్ను వెనక నుంచి మాత్రమే చూపించారు. అది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
టీజర్ అనౌన్స్‌మెంట్‌తో మూవీ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం పలు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ రైట్స్ కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియాతో పాటు గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. 'సలార్' సినిమా రైట్స్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 180 కోట్లు దాటవచ్చని సినీ వర్గాల టాక్.
-
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
— Hombale Films (@hombalefilms) July 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/QxtFZcNhrG #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Vx1i5oPLFI
">𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
— Hombale Films (@hombalefilms) July 3, 2023
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/QxtFZcNhrG #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Vx1i5oPLFI𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
— Hombale Films (@hombalefilms) July 3, 2023
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/QxtFZcNhrG #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Vx1i5oPLFI
Salaar Release Date : 'బాహుబలి-2' తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు నిరాశపర్చాయి. తాజాగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్'కు మిశ్రమ స్పందని లభించింది. దీంతో వరుసగా మూడు సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్' పైనే ఉన్నాయని అనడంలో సందేహం లేదు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే డార్లింగ్.. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించడం వల్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
Salaar Cast And Crew : ప్రభాస్‌కు జంటగా ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు పృథ్విరాజ్, గురుస్వామి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు.
ప్రాజెక్ట్ K...
Project K Cast : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో 'ప్రాజెక్ట్ కే' పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతోంది. సలార్ తర్వాత కొద్ది గ్యాప్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేయగా.. యూనివర్సెల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.