పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-కేజీయఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌కు ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజ్ అందింది. అయితే ఇది మూవీటీమ్‌కు మాత్రం కాస్త ఇబ్బందైన విషయమే. ఎందుకంటే ఈ మూవీకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా మరోసారి ప్రభాస్‌కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో మళ్లీ లీక్ అయింది. ప్రస్తుతం అది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ రఫ్‌లుక్‌లో అదిరిపోయేలా ఉన్నారు.
అయితే ఇటీవలే ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. దీంతో ప్రభాస్.. షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇంటి దగ్గరే ఉంటూ కృష్ణంరాజుకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అయితే తాజాగా లీక్ అయిన వీడియో ద్వారా ఆయన మళ్లీ షూటీంగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో హాఫ్ స్లీవ్ షర్టు, మెడలో చైన్‌తో మాస్ లుక్‌లో ప్రభాస్ దర్శనమించారు. ఇది చూసిన అభిమానులు సంతోషపడుతున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు. జగపతిబాబు, పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023లో ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.
-
Salaar leaked one feat Rolex bgm #Prabhas #Adipurush #Salaar pic.twitter.com/Jyp6doEIOH
— . (@Smartkurrodu) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Salaar leaked one feat Rolex bgm #Prabhas #Adipurush #Salaar pic.twitter.com/Jyp6doEIOH
— . (@Smartkurrodu) September 24, 2022Salaar leaked one feat Rolex bgm #Prabhas #Adipurush #Salaar pic.twitter.com/Jyp6doEIOH
— . (@Smartkurrodu) September 24, 2022
ఇదీ చూడండి: ఆ కోరిక తీర్చుకున్న యాంకర్ శ్యామల.. పల్లకిలో ఊరేగింపుగా వచ్చి..