ETV Bharat / entertainment

ఓవైపు 'సలార్'.. మరోవైపు 'వీరమల్లు'.. రామోజీ ఫిల్మ్​సిటీలో స్టార్ల షూటింగ్ - సలార్​ డైరెక్టర్

కేజీఎఫ్ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్​ స్టార్​ ప్రభాస్ నటిస్తున్న 'సలార్', పవర్​స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు'.. ఈ రెండు సినిమాల షూటింగ్​లు రామోజీ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నాయి.

prabhas salaar
సలార్ షూటింగ్
author img

By

Published : Oct 30, 2022, 8:48 AM IST

ఇద్దరు స్టార్‌ హీరోలు.. ఇద్దరివీ భారీ అంచనాలున్న సినిమాలే.. అంతకుమించిన యాక్షన్‌ ఘట్టాలు.. ఆ ఇద్దరు ఎవరో కాదు 'హరిహర వీరమల్లు'గా రానున్న పవన్‌ కల్యాణ్‌, సలార్‌గా అలరించనున్న ప్రభాస్‌. ఈ ఇద్దరి సినిమాల చిత్రీకరణలకు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది.

ప్రత్యేక సెట్లో 'సలార్‌'..
కేజీఎఫ్‌ చిత్రాల భారీ విజయం తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే బాగా క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌'. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బస్తీ సెట్లో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇక్కడే షూటింగ్‌ చేయనున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

గుర్రాలతో పోరాటం..
పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ కలయికలో వస్తున్న 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు నుంచీ ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా సెట్స్‌పై వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా సిద్ధమైంది చిత్రబృందం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. గుర్రాలతో సాగే ఓ పొరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. ఎ.ఎం.రత్నం, ఎం దయాకర్‌రావులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ నాయికగా నటిస్తోంది.

ఇవీ చదవండి: 'నా కోసమే ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు.. యశోదలో నా రోల్ అదే'

ఆ సినిమాలో చిరుతో కలిసి నటించడానికి కృష్ణ నో చెప్పారట.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.