ETV Bharat / entertainment

'గుంటూరు కారం' గందరగోళం.. 'మెగాప్రిన్స్' మీమ్స్​.. 'సలార్'​ పోస్టర్​లో 'కేజీయఫ్'!

ఈ రోజు(జూన్ 20) సోషల్​మీడియాలో ట్రెండ్​ అయిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి..

Prabhas Salaar Adipurush Mahesh babu Gunturukaram Ramcharan upasana Megaprince
'గుంటూరు కారం' గందరగోళం.. 'మెగాప్రిన్స్' మీమ్స్​.. 'సలార్'​ పోస్టర్​లో 'కేజీయఫ్'!
author img

By

Published : Jun 20, 2023, 8:30 PM IST

Updated : Jun 21, 2023, 6:58 AM IST

సోషల్​ మీడియాలో రోజు ఏదో ఒక దాని గురించి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అందులో ఎంటర్​టైన్మెంట్​ కూడా ఒకటి. సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా, తమ అభిమాన హీరోహీరోలకు సంబంధించిన వార్తలు వచ్చినా.. అలా ఏదో ఒకటి ట్రెండ్ చేస్తూనే ఉంటారు. మరి నేడు(జూన్​ 20) సినిమాకు సంబంధించి ట్రెండ్​ అయిన టాప్ విశేషాలేంటో చూద్దాం..

Megaprince : మీమ్స్​తో మెగాప్రిన్స్​ సందడి.. రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 'మెగా ప్రిన్సెస్‌' వచ్చేసిందంటూ సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తన్నారు. చిరంజీవిని కోట్‌ చేస్తూ 'బాసు పార్టీ లేదా' అని కొందరు అంటుంటే.. మరికొందరు 'ది లయన్‌ కింగ్‌'లో బేబీని పరిచయం చేసే సీన్స్​ను పోస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు.. అల్లు అర్జున్‌ తనయుడిని అయాన్‌ను కోట్‌ చేస్తూ గంగోత్రి సినిమాలోని సీన్స్​ను పోస్ట్ చేస్తున్నారు. అలా ఆ సరదా మీమ్స్​.. కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

Pooja hegdey Gunturu karam : గందరగోళంలో గుంటూరు కారం.. 'గుంటూరు కారం'లో హీరోయిన్​గా నటిస్తున్న పూజా హెగ్డే తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ప్లేస్​లో సంయుక్త మేనన్​ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొన్ని కారణాలతో షూటింగ్ షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. కథ మారిందంటూ, షూట్ చేసిన కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నట్లు, సంగీత దర్శకుడు తమన్​ను తప్పిస్తున్నట్లు ఇలా పలు రకాలు రూమర్స్​ వస్తున్నాయి. అయితే తమన్​ మాత్రం తన విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఇప్పటికే రిలీజ్​ డేట్స్​ కూడా నాలుగు మారాయి. సినిమా రిలీజ్​కు ఇంకా ఆరు నెలలే సమయం ఉంది. కానీ ఇంకా సినిమాలో నటించే నటులు, టెక్నిషియన్స్​పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉండే సరికి ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు దర్శకుడు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మధ్యలో షెడ్యూల్స్​ను పోస్ట్ పోన్ చేస్తూ పవన్ సినిమాలు(బ్రో, సుధీర్​ వర్శ మూవీ​)కు పనిచేస్తుండటం మహేశ్ అభిమానులకు నచ్చట్లేదు. మొత్తంగా సినిమా గురించి గందరగోళ పరిస్థితి నడుస్తోంది.

Prasanth Neel Salaar : సలార్​ కొత్త పోస్టర్​లో కేజీయఫ్.. ప్రభాస్ 'ఆదిపురుష్​' సినిమా వివాదాలతో ప్రతిరోజు ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో రూ.375కోట్లు వసూళ్లు చేసింది(Adipurush). అయితే ఈ మూవీ రిజల్ట్ పక్కనపెడితే.. సలార్ మూవీటీమ్​ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేసింది. సినిమాకు రిలీజ్​కు 100రోజుల కౌంట్​డౌన్ ఉన్నట్లు తెలిపింది. ప్రపంచానికి సీపీఆర్​ ఇచ్చే టైమ్​ వచ్చేసింది. సలార్​ సెప్టెంబర్​ 28న వచ్చేస్తుంది రెడీగా ఉండండి అని చెబుతూ ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా కేజీయఫ్​కు కనెక్షన్ ఉందని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే రిలీజ్​ చేసిన కొత్త పోస‍్టర్​ను కాస్త బ్రైటనెస్ పెంచి చూస్తే.. అందులో కొన్ని బాక్సులు కనిపిస్తున్నాయి. అయితే అవి కేజీయఫ్ 2లో రాఖీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అని నెటిజన్లు, సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే రిలీజ్​ అయ్యే వరకు చూడాల్సిందే.

ఇదీ చూడండి :

Ram Charan Baby : ఆనందంలో చిరంజీవి.. 'మెగా ప్రిన్సెస్'​కు వెల్​కమ్​ చెప్పిన తాతయ్య!

Adipurush box office day 4 : హిందీ కలెక్షన్స్ డౌన్​.. సినిమా ఆపాలంటూ మోదీకి ఫిర్యాదు​!

Last Updated : Jun 21, 2023, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.