ETV Bharat / entertainment

రిలీజ్​కు ముందే 'ప్రాజెక్ట్​-కే' సంచలనాలు.. నిర్మాతకు కనక వర్షం! - ప్రాజెక్ట్​ k తెలంగాణ డిస్ట్రిబ్యూషన్​ రైట్స్

నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ప్రాజెక్ట్​-కే. ఆదిపురుష్​, సలార్​ తర్వాత ప్రభాస్​ అప్​కమింగ్​ ప్రాజెక్ట్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ నయా అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేందంటే..

project k nizam rights
project k
author img

By

Published : Jan 3, 2023, 10:09 AM IST

ఆదిపురుష్​, సలార్​ తర్వాత డార్లింగ్​ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రాజెక్ట్-కే. సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నరు. దాదాపు 80 శాతం షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా షూటింగ్​ కొద్ది నెలల్లో ముగుస్తుంది. సీజీ, పోస్ట్​ ప్రొడక్షన్​ మెరుపులన్నింటిని అద్దుకుని ఈ సినిమా 2024లో రిలీజ్​కు సిద్ధం కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్​ను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇప్పటికే ప్రాజెక్ట్​-కే సినిమా రైట్స్​ను కొనుక్కునేందుకు ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఇందులో భాగంగా సినిమా నైజాం హక్కులు (తెలంగాణ) రూ.70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని సునీల్ నారంగ్ అలియాస్​ ఏషియన్ సునీల్ కొనుగోలు చేశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ హక్కులు దాదాపు రూ. 100 కోట్లకు అమ్ముడవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 170 కోట్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలుగు సినిమా పరిశ్రమకు సుమారు 50 శాతం వసూళ్లు నైజాం ఏరియా నుంచే వస్తుంటాయి. కాగా, ఇటీవలే ప్రాజెక్ట్-కే మేకింగ్‌కు సంబంధించిన ఓ బిహైండ్​ ద సీన్స్ వీడియోను మూవీ టీమ్​ విడుదల చేసింది. సిరీస్‌గా విడుదలయ్యే ఈ వీడియోలకు 'ఫ్రమ్ ది స్క్రాచ్' అని నామకరణం చేశారు. న్యూ ఇయర్​ ముందు వచ్చిన ఈ సిరీస్​లోని ఫస్ట్​ పార్ట్​కు 'రీ-ఇన్వెంటింగ్ ది వీల్' అని పేరు పెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.