Prabhas Maruthi Film : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. దర్శకుడు మారుతితోనూ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని మొదని నుంచి ప్రచారం సాగుతోంది. 'డీలక్స్ రాజా' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అయితే ఈ చిత్రాన్ని ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే ప్రారంభించి, కనీసం ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో అసలీ సినిమా ఉందా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.
అయితే ఎందుకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు? అసలు సైలెంట్‌గా ఎందుకు ఉంచుతున్నారు? అనేది కూడా ఇప్పటివరకు మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతి తెలివిగా సమాధానమిచ్చారు. రీజన్ చెప్పేందుకు కాస్త ప్రయత్నించారు.
"ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ను వదిలితే అటు ఫ్యాన్స్ ఇటు అభిమానులు గందరగోళానికి గురౌతారు. పైగా ముందుగానే వాటి అప్డేట్స్ కూడా బయటకు వచ్చేస్తే.. సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి కాస్త హైప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది" అంటూ మారుతి సమాధానం చెప్పారు.
ఇకపోతే ప్రభాస్ - మారుతి సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. లిమిటెడ్ బడ్జెట్‌తోనే సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Prabhas Upcoming Projects : ఇక ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ఆయన పలు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్.. డిసెంబర్లో విడుదలకు సిద్ధమైంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రాజెక్ట్ కె కల్కి కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ వంగాతో చేయాల్సిన స్పిరిట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో పాటు మరో ఇద్దరు దర్శకులతో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నారట.
Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్... మహేశ్-సూర్యతో సినిమా.. ఎప్పుడంటే?
NTR Cameo role : 'సలార్' - 'టైగర్ 3'లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్.. నిజమెంత?