ETV Bharat / entertainment

ఉమెన్​ సెంట్రిక్​ వెబ్​సిరీస్​తో క్రిష్​.. ప్రభాస్ కోసం కొరటాల ప్లాన్​! - దర్శకుడు క్రిష్​

పవన్​కల్యాణ్​తో సినిమా చేస్తున్న దర్శకుడు క్రిష్​.. త్వరలోనే ఓ ఉమెన్​ సెంట్రిక్​ వెబ్​సిరీస్​ను తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్టీఆర్​తో మూవీ చేయబోతున్న డైరెక్టర్​ కొరటాల శివ.. ఆ తర్వాత ప్రభాస్​ను లైన్​లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం అందింది.

Prabhas Koratala movie
ఉమెన్​ సెంట్రిక్​ వెబ్​సిరీస్​తో క్రిష్​
author img

By

Published : Jul 4, 2022, 3:38 PM IST

Director Krish Webseris: వెండితెరపై చెప్పలేని కొన్ని కథల్ని ప్రేక్షకులకు చూపించడానికి వెబ్​సిరీస్​లు ఇప్పుడు చక్కటి మార్గంగా మారిపోయాయి. ఈ సిరీస్​లకు ఆదరణ పెరుగుతుండటం వల్ల అగ్రదర్శకులు.. వీటిని రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడా జాబితాలోకి దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి కూడా చేరారు. ఇప్పటికే ఆయన '9 అవర్స్'​ వెబ్​సిరీస్​కు షో రన్నర్​గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ వెబ్​సిరీస్​ను స్వయంగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఉమెన్​ సెంట్రిక్ వెబ్​సిరీస్​ను రూపొందించాలని ఆలోచిస్తున్నారట. వ్యభిచారం చేసే వాళ్ల జీవితాల చుట్టూ ఈ కథ ఉంటుందని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే క్రిష్​ రూపొందించే తొలి వెబ్​సిరీస్​ ఇదే అవుతుంది. ప్రస్తుతం ఆయన.. పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​తో 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్​ షూటింగ్​ త్వరలోనే ప్రారంభంకానుంది.

Prabhas Koratala siva movie: టాలీవుడ్​లో మంచి క్రేజ్​ ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. హిట్​రైటర్​గా మంచిపేరున్న ఆయన్ను దర్శకుడిని చేసింది 'మిర్చి'. ప్రభాస్​ సరికొత్త స్టైల్​లో చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. మరోవైపు ప్రభాస్​కు 'బాహుబలి' తర్వాత సరైన్​ హిట్​ తగలలేదు. దీంతో కొరటాల-ప్రభాస్​ కాంబోలో మరో మిర్చి లాంటి సినిమా పడాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్​కు కిక్​నిచ్చే వార్త సోషల్​మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.​ డార్లింగ్​-కొరటాల కాంబోలో సినిమా ఉండబోతుందని, త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని కథనాలు వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్​ సినిమా తర్వాత అల్లుఅర్జున్, రామ్​చరణ్​లతో కొరటాల మూవీ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ అవి ఫైనల్​​ అవ్వలేదట. దీంతో ప్రభాస్​ను లైన్​లో పెట్టాలని కొరటాల ప్రయత్నిస్తున్నారని టాక్​ వినిపిస్తోంది.

ఇదీ చూడండి: పవర్​ఫుల్​గా 'అల్లూరి' టీజర్​.. హృదయాన్ని హత్తుకుంటున్న 'సీతారామం' సాంగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.