ETV Bharat / entertainment

నయా ట్రెండ్​ను ఫాలో అవుతున్న ప్రాజెక్ట్​-కె.. రెండు పార్ట్స్​గా రిలీజ్​ ? - project k latest updates

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్‌ కె' సినిమాని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు నాగ్​ అశ్విన్​ టీమ్ ప్లాన్​ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

project k
project k
author img

By

Published : Feb 2, 2023, 7:46 AM IST

ఈ మధ్య రిలీజైన సినిమాలన్నీ పార్ట్స్​గా విడుదలవుతున్నాయి. మొదటి భాగంలో చెప్పని విషయాలన్నీ రెండు లేక మూడు భాగాల్లో తెలియజేస్తారు. ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన సినిమాను మరో సారి చూడొచ్చు అనే ఉద్దేశంతో ఈ తరహా సినిమాలకు వెలకమ్​ చెప్తున్నారు. కేజీఎఫ్​, బాహుబలి,అవతార్​ లాంటి సినిమాలు ఇప్పటికే సిరీస్​ రూపంలో రిలీజవ్వగా.. లేటెస్ట్​గా వచ్చిన పొన్నియన్​ సెల్వన్​ త్వరలో పార్ట్​ 2 రిలీజ్​ చేసేందుకు సిద్ధమౌతోంది. మరి కొన్ని సినిమాలు కూడా సెకెండ్​ పార్ట్​లో రిలీజయ్యేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా వస్తున్న ప్రాజెక్ట్​-కె కూడా రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్​ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్​లో ప్రభాస్​కు జోడీగా దీపికా పదుకోణె నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.