Prabhas on Radheshyam movie: 'బాహుబలి' సిరీస్‌తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు ప్రభాస్. ఆ తర్వాత అదే జోరుతో వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'రాధేశ్యామ్'తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ మిశ్రమ స్పందనలను అందుకుంది. తాజాగా దీనిపై ప్రభాస్ స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి.
"బాహుబలి లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే నటుడిగా కొత్తదనం చూడలేను. పలు విభిన్నమైన చిత్రాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న బడ్జెట్ చిత్రాలైనా నాకిష్టమే. ఇక రాధేశ్యామ్ విషయానికొస్తే.. స్క్రిప్ట్‌లో ఏదైనా లోపం ఉండొచ్చు. లేకపోతే ప్రేమకథల్లో నన్ను చూడటానికి ఇష్టపడకపోవచ్చు. అయితే కరోనా కారణంగా టెలివిజన్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అలానే 'రాధేశ్యామ్'ను కూడా టెలివిజన్‌పై ఫ్యామిలీ అంతా కూర్చొని ఆస్వాదిస్తారని అనుకుంటున్నా." అని ప్రభాస్ అన్నట్లు ఆ కథనాల్లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్', 'స్పిరిట్' సహా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Roshan new movie: ఇటీవలే 'పెళ్లిసందడి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.. తన కొత్త సినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్పప్న సినిమాస్ బ్యానర్లో చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రోషన్ మరో సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. 'అలా మొదలైంది', 'ఓ బేబీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఇదీ చూడండి: బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి అప్పుడే!