ETV Bharat / entertainment

Bro Movie Review : 'బ్రో'.. మామా అల్లుళ్లు ఆడియెన్స్​ను మెప్పించారా? - బ్రో మూవీ తెలుగు రివ్య్యూ

Bro Movie Review : భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లలో విడుదలైన పవన్​ కల్యాణ్​ 'బ్రో' మూవీ ఎలా ఉందంటే ?

power star pawan kalyan bro movie review

author img

By

Published : Jul 28, 2023, 12:53 PM IST

BRO Movie Review : సినిమా : బ్రో; స్టార్స్ : పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు. మ్యూజిక్ : తమన్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; సినిమాటోగ్రఫీ: సుజీత్‌ వాసుదేవ్‌; రచన: సముద్రఖని, శ్రీవత్సన్‌, విజ్జి; స్క్రీన్‌ప్లే, డైలాగ్స్​: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌; దర్శకత్వం: సముద్రఖని; రిలీజ్​ డేట్​: 28-07-2023

పవర్​ స్టార్​ సినిమా రిలీజ్ అంటే ఇక అభిమానులకు పండగనే చెప్పాలి. ఇప్పటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పవన్​.. తాజాగా తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్​తో కలిసి 'బ్రో' అనే సినిమాలో నటించారు. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన 'వినోదయసిత్తం' రీమేక్​గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ లీడ్​ రోల్​లో రూపొందిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగ్స్​ రాశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తమిళ సినిమా 'వినోదయ సిత్తం' నుంచి ఏం తీసుకున్నారు. ఏయే మార్పులు చేశారు? ఇటువంటి విషయాలు తెలియాలంటే కథ గురించి తెలుసుకుందాం..

స్టోరీ ఏంటంటే : ఇంటికి పెద్ద కుమారుడైన మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధ‌ర‌మ్ తేజ్).. తన తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అన్ని బాధ్య‌త‌ల్నీ భుజాన మోస్తుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, ఓ త‌మ్ముడు స్థిర‌ప‌డాల‌ని కలలు కన్న తను ఉద్యోగంలోనూ మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని నిరంతరం శ్ర‌మిస్తుంటాడు. అయితే ఊహించ‌ని రీతిలో జరిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో మార్క్​ మరణిస్తాడు. దీంతో త‌న‌వాళ్లెవ‌రూ జీవితంలో స్థిర‌ప‌డ‌లేద‌ని, తాను చేయాల్సిన ప‌నులు ఎన్నో మిగిలిపోయాయ‌ని... త‌న జీవితాన్ని ఇంత తొంద‌ర‌గా ముగింపునివ్వ‌డం అన్యాయమని కాలం (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) అనే దేవుడి ముందు మొర‌పెట్టుకుంటాడు. దీంతో కాలం అనుగ్ర‌హించి 90 రోజులకు అత‌ని జీవిత‌కాలాన్ని పెంచుతాడు. అలా మ‌ళ్లీ తన ఇంటికి చేరిన మార్క్ తనకు దొరికిన 90 రోజుల్లో అనుకున్న‌వ‌న్నీ చేశాడా? లేక అత‌నివ‌ల్లే ప‌నుల‌న్నీ అయ్యాయా? ఇంకా ఆ 90 రోజుల్లో మార్క్​ ఏం తెలుసుకున్నాడు అన్నదే మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: టాప్​ హీరోల సినిమాల్లో కమర్షియల్​ ఎలిమెంట్స్​ కీ రోల్​ ప్లే చేస్తుంటాయి. ఇక ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సినిమా అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానుల‌కి కిక్ ఇచ్చేలా తాజా అంశాల్ని జోడిస్తూ వాళ్ల‌ని సంతృప్తిప‌ర‌చాల్సిందే. మ‌రి ఏమాత్రం కమర్షియల్​ ఎలిమెంట్స్ లేకుండా.. క‌థే మెయిన్​గా సాగే 'వినోదాయ సిత్త‌మ్‌'ని ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌తో రీమేక్ చేయ‌డం అనేది పెద్ద రిస్కే. అయితే ఆ విష‌యంలో ఉన్న సందేహాల‌న్నిటినీకి చెక్​ పెట్టేలా ప‌వ‌న్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్ర‌మ్ ఈ స్టోరీని త‌న‌దైన రచన శైలిలో మలిచారు. అలా ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఓల్డ్​ సినిమాల్లోని పాటలు ... ఆయ‌న మార్క్​ మేన‌రిజ‌మ్స్‌... ఇంకా కొన్ని ఫేమస్​ గెట‌ప్స్​ అన్నింటినీ ఈ సినిమాలోని సీన్స్​కు త‌గ్గ‌ట్టుగా మ‌లిచారు. అవిన్నీ థియేటర్​లో అభిమానుల చేత కేకలు పెట్టించేలా ఉన్నాయి.

మరోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పే డైలాగ్స్​ కూడా ఆయ‌న భావాలు ... రాజ‌కీయ సిద్ధాంతాల‌కి అనుగుణంగా కనిపించాయి. దీంతో ఈ సినిమా పవన్​ వీరోచితంగా ఫైట్లు చేయ‌డం లేద‌నే విష‌యాన్ని కూడా మ‌రిపించాయి. అలాగే ప‌వ‌న్ రోల్​ కూడా ఔచిత్యానికి త‌గ్గ‌ట్టుగానే తాను చిటికె వేసిన ప్ర‌తిసారీ హీరోయిజం పండిస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న దర్శకుడు సముద్రఖని ప్ర‌ధాన క‌థ‌కి ఎక్క‌డా స‌మ‌స్య రాకుండా చూసుకోవ‌డంలో సక్సెస్​ అయ్యారు.

అయితే ఒరిజినల్​ మూవీలోని తండ్రి పాత్ర‌ని... ఈ సినిమాలో పెద్ద కొడుకుగా మాలిచి దాని చుట్టూ అల్లిన కుటుంబ స‌న్నివేశాలు మంచి డ్రామాని పంచుతాయి. అంతే కాకుండా మార్క్ పాత్ర‌ని ఆట‌ప‌ట్టిస్తూ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చేసే హంగామా సినిమాకి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఓ వైపు లోతైన భావాల‌తో జీవిత స‌త్యాన్ని తెలిపేలా ఉంటూనే, మరోవైపు ఆ ఆట మంచి వినోదాన్ని పంచుతుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి మ‌రింత కీల‌కంగా ఉన్నాయి. మార్క్ మ‌న‌సుని తేలిక ప‌రిచే ఆ స‌న్నివేశాలకు ఆడియెన్స్​ బాగా క‌నెక్ట్ అవుతారు. ప్ర‌త్యేకంగా టీ క‌ప్పుని చూపించ‌డం నుంచి రాజ‌కీయాల్ని గుర్తు చేసే ప‌లు డైలాగ్స్​ కోసం మాటల మాంత్రికుడు స్పెషల్​ 'స్పేస్' తీసుకున్నట్లు అనిపిస్తోంది. 'మ‌న జీవితం, మ‌ర‌ణం భావిత‌రాల కోస‌మే...', 'పుట్టుక మ‌లుపు మ‌ర‌ణం గెలుపు' అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పే డైలాగ్స్​ ప్రేక్షకుల్లో ఆలోచ‌నలను రేకెత్తిస్తాయి. ఫస్ట్​ హాఫ్​లో వినోదం ప్ర‌ధాన‌మైతే... సెకెండ్​ హాఫ్​కు ఎమెషన్స్​ కీల‌కమయ్యాయి. అయితే మాతృక‌ స్థాయిలో భావోద్వేగాలు పండ‌క‌పోయినప్పటికీ ఈ సినిమా మాత్రం అందరిని మెప్పిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప‌వ‌న్‌క‌ల్యాణ్.. సాయిధ‌ర‌మ్ తేజ్‌ల మ‌ధ్య జరిగే స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీరిద్ద‌రి పాత్ర‌లూ ఆక‌ట్టుకుంటాయి. అభిమానుల్ని మెప్పించే మేనరిజ‌మ్స్‌తో ప‌వ‌న్‌కల్యాణ్‌ అద‌ర‌గొడితే... సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర మంచి డ్రామాని పండిస్తుంది. అటు అభిమానులూ... ఇటు సాధార‌ణ ప్రేక్ష‌కులూ సంతృప్తిప‌డే స‌న్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. సీనియర్​ కమెడియన్ బ్ర‌హ్మానందం ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర‌లో మెరుస్తారు. ఇక వెన్నెల కిశోర్‌, రోహిణి, త‌నికెళ్ల భ‌ర‌ణి, అలీ రెజా త‌దిత‌రులు తమ పాత్రల్లో బాగా నటించారు. టెక్నికల్​గానూ ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఇక త‌మ‌న్ పాట‌ల కంటే ఈ సినిమాకు ఆయనిచ్చిన నేప‌థ్య సంగీతం బాగుంటుంది. ఎడిటింగ్‌, కెమెరా, ఆర్ట్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త్రివిక్ర‌మ్ రైటింగ్​ స్టైల్​ అభిమానుల్ని మెప్పించింది. సంఘ‌ర్ష‌ణ‌, భావోద్వేగాలు బ‌లంగా పండ‌క‌పోయినప్పటికీ.. మాతృక‌లో చెప్పిన విష‌యాన్నింటినీ తెలుగులోనూ దర్శకుడు ప్రేక్ష‌కులకు విజ‌య‌వంతంగా చెప్పిన‌ట్టే అనిపిస్తోంది. నిర్మాణం కూడా బాగుంది.

బ‌లాలు

  • + ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. తేజ్ మ‌ధ్య స‌న్నివేశాలు
  • + అభిమానుల్ని మెప్పించే అంశాలు
  • + ప్ర‌థ‌మార్ధంలో వినోదం

బ‌ల‌హీన‌త‌లు

  • - క‌థ‌లో కొర‌వ‌డిన సంఘ‌ర్ష‌ణ‌

చివ‌రిగా...: పవన్‌ బ్రో... ఎనర్జీతో మెప్పిస్తాడు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.