ETV Bharat / entertainment

'అంతా దాన్ని మరిచిపోవడానికే'.. మణిరత్నం 'పొన్నియిన్‌ సెల్వన్‌' టీజర్‌ - mani ratnam ponniyin selvan

స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'పొన్నియన్​ సెల్వన్-1​' సినిమా వచ్చేసింది. చోళ రాజ్యం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా చాలా.. విజవల్​ వండర్​గా నిలిచిపోయే అవకాశం ఉంది. టీజర్​లోని డైలాగ్స్​ కట్టిపడేశాయి.

Ponniyin Selvan
యపొన్నిన్​ సెల్వన్
author img

By

Published : Jul 8, 2022, 7:02 PM IST

అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌-1'. విక్రమ్‌, కార్తి , జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చిత్ర టీజర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికే.. నన్ను నేను మర్చిపోవడానికి.. ' అంటూ విక్రమ్‌ పలికిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా సినిమాలో నటిస్తున్న కీలక పాత్రలను పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసింది. ఇక తెలుగు టీజర్‌ను మహేశ్‌బాబు, హిందీలో అమితాబ్‌, మలయాళంలో మోహన్‌లాల్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: గుండెపోటా? జ్వరమా? చియాన్​ విక్రమ్​ హెల్త్​పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.