ETV Bharat / entertainment

నిజమేనా భయ్యా.. పవన్​ వాచ్​, షూస్​ ధర అన్ని లక్షలా? - పవన్​కల్యాణ్​ షూస్ ధర వైరల్​

హరిహర వీరమల్లు ప్రీ షెడ్యూల్‌ వర్క్‌ షాప్​లో పవన్​కల్యాణ్​ ధరించిన వాచ్​, షూస్​ ధర సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది. ఆ సంగతలు..

Pawankalyan watch shoes price viral
పవన్​ వాచ్​, షూస్​ ధర అన్ని లక్షలా
author img

By

Published : Oct 2, 2022, 3:37 PM IST

పవన్​కల్యాణ్​ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఇటీవలే ఈ సినిమా ప్రీ షెడ్యూల్‌ వర్క్‌ షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌ షాప్‌లో పవన్‌ కల్యాణ్‌, నిధి అగర్వాల్, క్రిష్‌, కీరవాణి సహా పలువురు పాల్గొన్నారు. అయితే ఈ ఫొటోల్లో పవన్‌ లుక్​ వైరల్ అయిన సంగతి తెలిసిందే. రెడ్‌ టీషర్ట్‌, జీన్స్‌, షూస్‌ వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ స్టోరీ డిస్కషన్‌ చేస్తూ కనిపించారు. అయితే ఇప్పుడు ఆ ఫొటోస్​ పవన్‌ పెట్టుకున్న వాచ్‌, వేసుకున్న షూస్‌పై నెట్టింట ఓ చర్చ జరుగుతోంది. ఆయన ధరించిన వాచ్‌ రూ.14 లక్షలని, షూస్‌ రూ.10 లక్షలు అంటూ కొందరు ట్రోల్‌ చేశారు. అయితే అది నిజం కాదంటూ మరి కొందరూ వాటికి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అవి ఏ కంపెనీకి చెందినవి, వాటి ధర ఎంత ఉంటుంది? వంటి విషయాలు తెలుపుతూ కొన్ని కథనాలు వచ్చాయి.

వాటి ప్రకారం.. పవన్‌ పెట్టుకున్న వాచ్‌ ఇటలీ సంస్థ పనేరాయ్‌ కంపెనీకి చెందిందట. పనేరాయ్‌ లోని సబ్‌ మెర్సిబుల్‌ కార్బోటెక్‌ 47ఎంఎం అనే మోడల్‌ వాచ్‌ అంట. దాని ధర అక్షరాలా రూ.14,37,000 అని తెలిసింది. ఇక షూస్ Copenhagen​ కంపెనీకి చెందినవట. దీని ధర మాత్రం పది లక్షలు ఉండవని.. రూ.9,600 వరకు ఉంటుందని అంటున్నారు.

కాగా, హరిహర వీరమల్లు విషయానికొస్తే పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే భారీబడ్జెట్‌, పాన్ ఇండియా, చారిత్రక నేపథ్యం లాంటి విశేషాలతో రూపుదిద్దుకుంటోంది. ఇక క్రిష్ దర్శకత్వం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. నిధి అగర్వాల్‌, నర్గీస్‌ ఫక్రీ, అర్జున్‌రామ్‌పాల్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుడు బెన్‌లాక్ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్‌ హంగులను సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, ప్రచారచిత్రాలు ఆసక్తికరంగా ఉండటం వల్ల ప్రేక్షకులు, అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదీ చూడండి: పెద్దపులితో ప్రియా ప్రకాశ్​ ఆటలు.. దానిపై ఎక్కి, పొడుకుని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.