ETV Bharat / entertainment

మరో కొత్త ప్రయోగంతో సూర్య.. అకీర 'దోస్తీ' సాంగ్​ - సూర్య కొత్త సినిమా శివ దర్శకత్వంలో

కథానాయకుడు సూర్య మరో కొత్త చిత్రానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. దర్శకుడు శివతో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారని సమాచారం. మరోవైపు పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ తనయుడు అకీర 'దోస్తీ' గీతాన్ని పియోనోతో ప్లే చేశాడు. అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Akira dosti
అకీర దోస్తీ
author img

By

Published : May 24, 2022, 7:42 PM IST

Hero surya new movie: కోలీవుడ్​లో కమల్​హాసన్​, విక్రమ్​ తర్వాత ప్రయోగాత్మక చిత్రాలు చేసేది హీరో సూర్యనే. ఎలాంటి పాత్రను చేయడానికైనా వెనకాడరు. అయితే ఇప్పుడాయన మరో విభిన్నమైన సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. మాస్​ డైరెక్టర్​ శివతో కలిసి ఓ చారిత్రక నేపథ్యంలో మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్​. రెండు పాత్రల్లో వేరియేషన్​ ఒక రేంజ్​లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఓ పాత్ర కోసం సూర్య.. వర్క్​షాప్​లో కూడా పాల్గొన్నారట. పాన్​ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేస్తారని సమాచారం.

Akira Dosti music: పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను పీయోనో ప్లే చేసే విధానానికి అంతా ఫిదా అవుతున్నారు. తమ స్కూల్‌లో సోమవారం నిర్వహించిన ఫేర్‌వెల్‌ పార్టీ (గ్రాడ్యుయేషన్‌ డే)లో అకీరా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని 'దోస్తీ' గీతాన్ని పియోనోతో ప్లే చేశాడు. తన స్నేహితులు, పాఠశాల యాజమాన్యాన్ని అలరించాడు. సంబంధిత వీడియోను తన తల్లి రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తనయుడి ప్రతిభను కీర్తిస్తూ పోస్ట్‌ పెట్టారు. అకీరా ఎదుగుదలపై ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ వేడుకకు అకీరా తండ్రి పవన్‌కల్యాణ్‌ సైతం హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో కొడుకు అకీరా, కుమార్తె ఆద్యతోపాటు పవన్‌కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను రేణు సోషల్‌ మీడియాలో పంచుకోగా కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చాలాకాలం తర్వాత పవన్‌- రేణు ఒకే వేదికపై కనిపించడంతో తమ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అకీరాకు కర్రసాము, బాక్సింగ్‌లోనూ ప్రావీణ్యం ఉంది.

ఇదీ చూడండి: శింబు తండ్రికి అస్వస్థత.. సూర్య కొత్త ప్రయోగం.. అకీర 'దోస్తీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.