ETV Bharat / entertainment

'బ్రో'.. పవన్​ సినిమాకు ఊహించని షాక్​! - బ్రో సినిమాకు ఓవర్సీస్​ బయర్​

Pawankalyan Saitej Bro movie : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్​కు దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో సినిమాకు ఓ ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..

Pawankalyan
ఇదేం ప్లానింగ్ 'బ్రో'.. సినిమాకు ఊహించని షాక్​!
author img

By

Published : Jul 13, 2023, 10:50 AM IST

Pawankalyan Saitej Bro movie : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్​ సినిమా 'బ్రో' రిలీజ్​కు రెడీ అయింది. మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలాంటి సమయంలో మూవీటీమ్​ ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లోగా ఉన్నట్లు అంటున్నారు. అలాగే భారీ స్థాయిలో బజ్ కూడా క్రియేట్​ అవ్వలేదని ప్రచారం సాగుతోంది. నిజానికి పవన్ సినిమా అంటే రిలీజ్​కు నెల రోజుల ముందు నుంచే సందడి వాతావరణం కనిపిస్తుంటుంది. పవన్​కు సంబంధించిన సాంగ్స్​, టీజర్స్​తో అభిమానులు సోషల్​ మీడియాను హోరెత్తిస్తుంటారు. కానీ ఇప్పుడు 'బ్రో' సినిమా విషయంలో ఆ హడావుడి కాస్త తక్కువగా కనిపిస్తోంది.

ఈ సినిమా కోసం 20 నుంచి 25 రోజల డేట్స్​ ఇచ్చి తన పార్ట్​ షూట్​ను చాలా వేగంగా పూర్తి చేశారు పవన్​. మేకర్స్​​ కూడా అంతే వేగంగా మొత్తం సినిమా చిత్రీకరణను కంప్లీట్​ చేశారు. అయితే ఇప్పుడా ఆ స్పీడ్ కనపడట్లేదు. విడుదల ఇంకా 20 రోజుల సమయమే ఉంది. కానీ ప్రమోషన్స్​లో జోరు కనిపించట్లేదు. ఇప్పటివరకు టీజర్​తో పాటు ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే పవన్​ - సాయికు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా​ ఇంకా పెండింగ్​లోనే ఉందని సమాచారం అందింది. ప్రస్తుతం పవన్​ ఏపీ రాజకీయాలంటూ వారాహి విజయ యాత్రలో ఖాళీ లేకుండా వరుస షెడ్యూల్స్​తో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ వర్క్​ అంత త్వరగా పూర్తి అవ్వడం కష్టమే. మరో వారం అయినా ఈజీగా పడుతుంది.

ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనేది ఎటువంటి సమాచారం కూడా తెలియలేదు. మరోవైపు ఓవర్సీస్​ బయర్స్​ ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపనట్లు తెలిసింది. ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ ​ చెప్పిన ధరకు అక్కడి వారు కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదట. దీంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓవర్సీస్​లో సొంతంగా రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుందట. కాబట్టి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని సినిమాకు సంబంధించిన సీజీ వర్క్​, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్​ వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రమోషన్స్​లోనూ మరింత వేగం పెంచి ఆడియెన్స్​లో భారీ బజ్ క్రియేట్ చేయాలి. మరి మిగిలి ఉన్న ఈ 20 రోజుల్లో ప్రమోషన్స్ ఎలా చేస్తారో వేచి చూడాలి...

ఇదీ చూడండి:

'బ్రో' క్లైమాక్స్​లో త్రివిక్రమ్​ హ్యాండ్​.. అలా ఉండబోతుందట!

పవన్ 'బ్రో' టీజర్ వచ్చేసిందోచ్​.. మామ-అల్లుడు అదరగొట్టేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.