Pawankalyan Harihara veeramallu 1000 member fight sequence: హీరోలు.. కల్లు చెదిరే స్టంట్లు, అదిరిపోయే ఫైట్లు చేస్తే అభిమానులకు పండగే. ఇక వాళ్ల ఒంట్లో ఊపే. థియేటర్లలో ఈలలు, కేరింతలతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందుకే దర్శక నిర్మాతలు.. తమ సినిమాల్లో హీరోలతో యాక్షన్ సీన్స్ చేయిస్తుంటారు. అయితే ఈ పోరాట సన్నివేశాల్లో మన కథానాయకులు ఒకేసారి వంద మందితో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. చారిత్రక సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూస్తుంటాం. అయితే అది గతం. ఇప్పుడు మన హీరోలు ఒక్కరే ఏకంగా వెయ్యి, రెండు వేల మందితో తలపడేందుకు సిద్ధమైపోతున్నారు. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్'లో ఎంట్రీ సీన్ కోసం రామ్‌చరణ్ 2 వేల మందితో పోరాడగా.. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కూడా వెయ్యి మందితో తలపడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అందుకు కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఆయన నటించనున్న తాజా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కొత్త షెడ్యూల్లో భాగంగా భారీ సెట్లో హై యాక్షన్ వోల్టేజ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇందులో పవన్ ఒక్కడే వందలమందిని ఎదిరించబోతున్నారని తెలిసింది. ఇందుకోసం వెయ్యి మంది ఆర్టిస్టులను రంగంలోకి దింపారని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికే హైలైట్‌గా నిలవబోతుందని సినీవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చిత్రసీమలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కాగా, పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎ.దయాకర్‌రావు, ఎ.ఎమ్.రత్నం నిర్మాతలు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కూడా ఇందులో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా పలు చారిత్రక కట్టడాల్ని సెట్స్‌గా తీర్చిదిద్దుతూ చిత్రీకరణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: తెలుగు దర్శకులు.. తమిళ హీరోలు.. కాంబినేషన్ అదిరింది!