ETV Bharat / entertainment

Pawan Kalyan Upcoming Projects : పవన్ ఫ్యాన్స్​.. వీటిపై అస్సలు ఆశలు పెట్టుకోవద్దు.. డౌటే! - పవన్ కల్యాణ్ ఓజీ షూటింగ్ అప్డేట్​

Pawan Kalyan Upcoming Projects : పవన్ కల్యాణ్​ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాల గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులు...

Pawan kalyan
Pawan Kalyan Upcoming Projects : పవన్ ఫ్యాన్స్​.. దీనిపై అస్సలు ఆశలు పెట్టుకోవద్దు.. డౌటే!
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 9:18 PM IST

Pawan Kalyan Upcoming Projects : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఏడాదికి ఓ సినిమాతో అటు అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2021లో 'వకీల్ సాబ్'తో అభిమానులను పలకరించిన పవన్.. గత ఏడాది 'భీమ్లా నాయక్' అంటూ సౌండ్ మోగించారు. ఇక ఈ ఏడాది 'బ్రో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. అయితే ఈ మూడు చిత్రాలు రీమేక్ కావడం వల్ల.. అభిమానులు కాస్త నిరాశ పడ్డారు.

అయితే ఇప్పుడు అభిమానులు.. పవన్ నుంచి స్ట్రెయిట్ సినిమాలు ఆశిస్తున్నారు. అలాగే పవర్ స్టార్ కూడా స్ట్రైయిట్ మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. మేకింగ్ దశలోనే ఉన్నాయి. ఈ మూడు సినిమాలపై మంచి హైప్ ఉన్నాయి. అలాగే ఈ చిత్రాల రిలీజ్ డేట్స్​పై పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. 'ఓజీ' ఈ డిసెంబర్​లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రచారం సాగగా. ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి అంటూ వార్తలు వచ్చాయి. ఇక హరిహర వీరమల్లు కూడా ఏపీ ఎలక్షన్స్​లోపే విడుదల చేస్తామని నిర్మాత ఎ.ఎం.రత్నం అన్నారు.

కానీ ఈ చిత్రాలేమీ అనుకున్న ప్రకారం విడుదలయ్యే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. 'ఓజీ' షూటింగ్‌‌కు ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చారు పవన్​. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో అప్పుడప్పుడు ఒక్కో షెడ్యూల్ పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా షూట్‌కు పవన్ అందుబాటులోకి రారని తెలిసింది. హరిహర వీరమల్లు అస్సలు అడ్రెస్ లేదు. ప్రస్తుతం ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కాబట్టి పవన్ ఫోకస్ రాజకీయాలపై ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మూడు సినిమాల్లో ఒక్కటి కూడా వేసవిలోపు విడుదలయ్యే ఛాన్స్​ లేదని తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే గ్యాప్ లేకుండా సినిమాలను చకాచకా పూర్తి చేస్తారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఈ సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో..

Telugu Upcoming Movies : ఈ స్టార్​ హీరోల రూటే సపరేటు.. అందరూ అలాంటి కథలతోనే!

Kriti Kharbanda Latest Photos : బాత్ రూమ్‌లో పవన్ హీరోయిన్​ ఫొటోషూట్​.. చెమటలు కక్కుతూ అందాలన్నింటినీ చూపిస్తూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.