Pawan Kalyan Shoes : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న ఆయన ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాల్లో గానీ రాజకీయాల్లో గానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేసినా సెన్సేషన్‌గానే నిలుస్తోంది. ఎలాంటి లుక్‌లో మెరిసినా.. ఎలాంటి దుస్తుల్లో కనిపించినా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే పవన్ వేసుకున్న ఓ షూస్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోెంది. ఆ షూ ధర తెలుసుకున్న అభిమానులు నోరెల్లబెడుతున్నారు.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'బ్రో' సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఫొటో షూట్ చేసింది మూవీ టీమ్. ఇందులో భాగంగా ఓ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. అందులో మామా అల్లుళ్లు పవన్, సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే లుక్‌లో కనిపించారు. ఓ వైపు బైక్‌పై కాలుపెట్టి పవన్ స్టైలిష్ లుక్ ఇవ్వగా.. వెనకాల సాయితేజ్ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అయితే ఇందలో పవన్ వేసుకున్న షూస్ ట్రెండీగా ఉండటం వల్ల అభిమానులు దాన్ని గురించి గూగుల్‌లో తెగ వెతికేసి.. బ్రాండ్, ధర ఇలా అన్నీ విషయాలను తెలుసుకున్నారు.
Pawan Kalyann Shoe Cost : వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబోలో అట్రాక్టివ్‌గా ఉన్న ఈ షూస్ బాల్మైన్ (Balmain) అనే ఇంటర్నేషనల్ కంపెనీకి చెందినవి. దీని ధర అక్షరాలా.. రూ. 1,06,070 (లక్షా ఆరువేల డెబ్భై రూపాయలు) ఇక ఈ ధర తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ షూస్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Bro Movie Cast : ఇక 'బ్రో' సినిమా విషయానికి వస్తే.. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను అందిస్తున్నారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, బ్రహ్మానందం లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్నారు.
-
Here's the 1st Peek at #BroTheAvatar Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's the 1st Peek at #BroTheAvatar Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023Here's the 1st Peek at #BroTheAvatar Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023