ETV Bharat / entertainment

ఆస్కార్​ వేడుకకు అంతా రెడీ.. స్ట్రీమింగ్​ ఎప్పుడు? ఎలా చూడొచ్చు? - ఆస్కార్​ 2023 వేదిక

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం అట్టాహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆ వేడుకను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడొచ్చంటే..

Oscars 2023
Oscars 2023
author img

By

Published : Mar 11, 2023, 7:34 AM IST

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. యావత్​ సినీ ప్రపంచమే ఎదురు చూసే ఈ వేడుకల కోసం యూఎస్​ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‏ డాల్బీ థియేటర్​ సిద్ధమయ్యింది. ఈ అవార్డును ముద్దాడేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో సినిమాలు వివిధ కేటగిరీలో పోటీ పడుతుంటాయి. అయితే విజయం మాత్రం ఒక్కరినే వరిస్తుంది. ఏటా జరిగే ఈ సంబరాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నప్పటికీ ఈ సారి మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే ఇప్పుడు ఆ రేసులో మన తెలుగు సినిమా పోటీ పడుతోంది. దీంతో ఈ అవార్డులపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పటికే ఈ అవార్డు వేడుకకు హాజరయ్యేందుకు ఎందరో ప్రముఖులు అమెరికాకు విచ్చేశారు. అందులో ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ కూడా ఒకటి. అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఈ అవార్డు ఫంక్షన్​ మార్చి 12 ఉదయం 8 గంటలకు మొదలు కానుంది.. భారత్​ కాలమానం ప్రకారం సోమవారం.. అంటే 13వ తేదీ ఉదయం 5.30 గంటలకు మనం లైవ్​లో చూడొచ్చు.

హోస్టులు వీరే..
ఈ అవార్డుల వేడుకను అమెరికన్​ టెలివిజన్​ హోస్ట్​ జిమ్మీ కెమెల్​ రెడీగా ఉన్నారు. అయితే గత ఏడాది వాండా సైక్స్, రెజీనా హాల్, అమీ షుమెర్​లు హోస్టులుగా వ్యవహరించారు.

ఎక్కడ చూడొచ్చంటే..
హులు లైవ్​ టీవీ, యూట్యూబ్​టీవీ, ఏటీ అండ్​ టీ టీవీ , ఫుబో టీవీ సబ్​స్క్రిప్షన్​ ద్వారా ఈ వేడుకను వీక్షించవచ్చు. అయితే కొన్ని ఛానళ్లు ఉచితంగా ట్రయల్స్​ను కూడా అందిస్తున్నాయి. ఏబీసీ.కామ్​ లేకుంటే ఏబీసీ మొబైల్​ యాప్​లో కూడా దీన్ని వీక్షించవచ్చు.

ఉత్తమ సినిమాల నామినేషన్​..
అవతార్- ది వే ఆఫ్ వాటర్, విమెన్ టాకింగ్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిష్రెయిన్, ఎల్విస్, ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్, ది ఫేబుల్‌మ్యాన్స్, టార్, టాప్ గన్, మావెరిక్, ట్రయాంగిల్ ఆఫ్ జోరో సినిమాలు ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడుతున్నాయి.

అవార్డులను అందించేది వీరే..
బాలీవుడ్​ స్టార్ దీపిక పదుకొణె, మాకు హాలీ బెయిలీ, ఆంటోనియో బాండెరాస్, ఎలిజబెత్ బ్యాంక్స్, జెస్సికా చస్టెయిన్, జాన్ చో, ఆండ్రూ గార్ఫీల్డ్, హగ్ గ్రాంట్, డానై గురిరా, సల్మా హాయక్ పినాల్ట్, నికోల్ కిడ్‌మన్, ఫ్లోరెన్స్ ప్​గ్​లు ఉన్నారు.

వీవర్ రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, జెన్నిఫర్ కన్నెల్లీ, అరియానా డిబోస్, శామ్యూల్ ఎల్. జాక్సన్, డ్వేన్ జాన్సన్, మైఖేల్ బి. జోర్డాన్, ట్రాయ్ కోట్‌సూర్, జోనాథన్ మేజర్స్, మెలిస్సా, జానెల్ మోన్‌కార్తీ అవార్డులను అందిచనున్నారు.

ఇక ఈ జాబితాలో క్వెస్ట్‌లోవ్, జో సల్దానా, డోనీ యెన్. హాలీ బెర్రీ, పాల్ డానో, కారా డెలివింగ్నే, హారిసన్ ఫోర్డ్, కేట్ హడ్సన్, మిండీ కాలింగ్, ఎవా లాంగోరియా, జూలియా లూయిస్-డ్రేఫస్, ఆండీ మెక్‌డోవెల్, ఎలిజబెత్ ఒల్సేన్, పెడ్రో పాస్కల్, జాన్ ట్రవోల్టాలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.