ETV Bharat / entertainment

భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. ట్రైలర్‌ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్'​​ ఫ్యాన్స్ - vijay deverakonda bollywood debut

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' సినిమా ట్రైలర్​ అదిరిపోయింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్​ ఫాన్స్​ కేక పుట్టించారు. భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ట్రైలర్​ రిలీజ్​ సందర్భంగా విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

vijay deverakonda
భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. లైగర్‌ 'ట్రైలర్‌' వేడుకలో కేక పుట్టించిన విజయ్​ ఫ్యాన్స్
author img

By

Published : Jul 21, 2022, 4:15 PM IST

ఆగస్టు 25న ఇండియా షేక్‌ అవుతుందని నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'లైగర్‌' ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక గురువారం ఉదయం సుదర్శన్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్‌.. ''ఈ రోజు మీ అందర్నీ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా కుటుంబం గురించి తెలియదు. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అది కూడా అంత పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా, ఈరోజు ట్రైలర్‌కు మీ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ చిత్రాన్ని మీకే అంకితం చేస్తున్నా. మీకోసమే సినిమాలో ఆ బాడీ ట్రై చేశా. డ్యాన్సులంటే నాకు చిరాకు. కానీ, మీ కోసమే చేశా. మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్‌లు అన్నీ నిండిపోవాలి. ఆ రోజు ఇండియా షేక్‌ అవుతుంది'' అని అన్నారు.

అనంతరం చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ''నేను 'లైగర్‌' గురించి చెప్పడం లేదు. కేవలం విజయ్‌ గురించే చెబుతున్నా. సినిమా పరిశ్రమలో విజయ్‌ దేవరకొండ పేరు గొప్పగా వినిపించనుంది. ఈ సినిమా నిర్మాణంలో కరణ్‌ జోహార్‌ మాకెంతో అండగా నిలిచారు. ఆయన్ని ఇక్కడికి పిలిచింది ట్రైలర్‌ చూపించడానికి కాదు. సినిమాపై మన తెలుగువాళ్లకు ఉన్న ప్రేమను చూపించడానికి. ఆగస్టు 25న అదరగొట్టేద్దాం'' అని తెలిపారు. ఇక థియేటర్‌లో అభిమానుల సందడి చూసిన నటి అనన్య ఆశ్చర్యపోయారు. తెలుగువారి ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.

vijay deverakonda
విజయ్​ ఫ్యాన్స్​
భారీ కటౌvijay deverakondaట్స్‌
భారీ కటౌట్స్‌

విజయ్​ ఫ్యాన్స్​ రచ్చ..

థియేటర్‌ బయట భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. థియేటర్‌ లోపల ఇసుక వేస్తే రాలనంతమంది జనాలు.. విజయ్‌.. విజయ్‌ అంటూ కేకలు.. ఇది ఈరోజు 'లైగర్‌'(Liger) ట్రైలర్‌ విడుదల వేడుకలో దర్శనమిచ్చిన చిత్రాలు. ఇవన్నీ చూసి యాంకర్‌ సుమ (Suma) షాక్‌ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రోగ్రామ్‌ చూడలేదంటూ కామెంట్‌ చేశారు. అభిమానులందర్నీ ఆకట్టుకునేలా ప్రోగ్రామ్‌ హోస్ట్‌ చేయడానికి ఆమె ఏకంగా మూడు మైకులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చదవండి: డాక్యుమెంటరీగా నయన్-విఘ్నేశ్​​ లవ్​స్టోరీ.. ఆ రూమర్స్​పై క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.