ETV Bharat / entertainment

'రామాయణానికి భిన్నంగా 'ఆదిపురుష్‌''.. క్లారిటీ ఇచ్చిన ఓం రౌత్‌ - ఆదిపురుష్​ ట్రోల్స్

Om Raut On Adipurush : ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్‌'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ అంతటా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇందులోని పాత్రల లుక్స్‌పై రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన 'రామాయణం' నటీనటులు సహా పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు ఓం రౌత్‌ స్పందించారు.

Om Raut On Adipurush
Om Raut On Adipurush
author img

By

Published : Oct 7, 2022, 5:21 PM IST

Om Raut On Adipurush : సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్‌'. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి పాత్రధారి అయిన సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌పై విపరీతమైన ట్రోల్స్‌ చేస్తున్నారు. గతంలో వచ్చిన 'రామాయణం' సీరియల్‌లోని రావణాసురుడి లుక్‌ను 'ఆదిపురుష్‌'లోని లుక్‌తో పోల్చుతూ పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. దీనిపై తాజాగా డైరెక్టర్‌ ఓం రౌత్‌ స్పందించారు.

''రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్స్‌తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన 'రామాయణం'లో పొడవాటి జుత్తు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంలో రావణాసురుడిని చూపించారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా తెలియజేశారు. కానీ, ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికీ ఈ సినిమా చేరాలని అనుకుంటున్నా. ఈ సినిమాతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజెప్పాలనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే రావణాసురుడి లుక్‌ను అలా డిజైన్‌ చేశాం. రావణాసురుడు ఒక భయంకరమైన పక్షిపై ప్రయాణిస్తున్నట్లు టీజర్‌లో చూపించాం. అయితే, దాన్ని కూడా అందరూ తప్పుపడుతున్నారు. కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రావొద్దు. సినిమా చూశాక మాట్లాడండి. ఇక సినిమాలో హనుమంతుడికి లెదర్‌ దుస్తులు వేశామని అందరూ విమర్శిస్తున్నారు. నిజం చెప్పాలంటే మేము ఎలాంటి లెదర్‌ దుస్తులు ఉపయోగించలేదు'' అని ఓంరౌత్‌ వివరణ ఇచ్చారు.

'రామాయణానికి భిన్నంగా 'ఆదిపురుష్‌'
మరోవైపు.. 'ఆదిపురుష్‌' చిత్రం అసలు రామాయణానికి భిన్నంగా ఉందని రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన 'రామాయణం' నటీనటులు విమర్శించారు. టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకున్నారు కానీ.. అసలు రామాయణాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరించలేదని అభిప్రాయపడ్డారు. టీజర్​లో చూపించిన రామ, రావణ పాత్రలను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సీతారామ, రావణ, లక్ష్మణ పాత్రలు ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్నాయని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్​ సైతం టీజర్​లో చూపించిన రామ, రావణ పాత్రలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్‌' చిత్రాన్ని ఓం రౌత్‌ తెరకెక్కించారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా సిద్ధమైన ఈ సినిమాలో కృతిసనన్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి: 60 థియేటర్లలో 'ఆదిపురుష్​' త్రీడీ టీజర్.. ట్రోల్స్​కు దిల్​రాజు స్ట్రాంగ్ కౌంటర్

'ఆదిపురుష్'​కు కాపీ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన యానిమేషన్​ సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.