ETV Bharat / entertainment

October Upcoming Movies 2023 : దసరాకు ముందే బాక్సాఫీస్ వద్ద సందడి.. ఒక్కరోజే 8 సినిమాలు రిలీజ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 12:39 PM IST

Updated : Oct 9, 2023, 3:16 PM IST

October Upcoming Movies 2023 : 2023 దసరా బరిలో బాక్సాఫీస్ వద్ద అగ్రకథానాయకుల సినిమాలు రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. అయితే అంతకుముందే ఈ వారం విడుదల కానున్న తెలుగు సినిమాలేంటో చూసేద్దామా?

October Upcoming Movies 2023
October Upcoming Movies 2023

October Upcoming Movies 2023 : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలను సంక్రాంతి, దసరా పండగలకు రిలీజ్ చేయడం సెంటిమెంట్​గా వస్తోంది. ఈ రెండు పండగలకు బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఈసారి దసరాకు కూడా బాక్సాఫీస్​ను పలకరించడానికి స్టార్ హీరోల సినిమాలు రెడీ అయ్యాయి. బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు', విజయ్ 'లియో' ఇలా సినిమాలు క్యూ కట్టాయి. ఇలా అన్ని పెద్ద సినిమాలు రావడం వల్ల.. చిన్న చిన్న చిత్రాలు దసరా కంటే ముందే రిలీజ్​ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

మా ఊరి సిన్మా.. మహేశ్-ప్రియాపాల్ జంటగా నటించిన చిత్రం 'మా ఊరి సిన్మా'. డైరెక్టర్ శివరామ్ తేజ తెరకెక్కించిన ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత జి.మంజునాథ్‌రెడ్డి రూపొందించారు. తండ్రీ కొడుకుల అనురాగం, బావ మరదళ్ల సరసం అన్ని ఎమోషన్స్‌ ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది.

గాడ్.. నటుడు జయం రవి-కోలీవుడ్ లేడీ సూపర్​స్టార్ నయనతార కీ రోల్స్​లో తెరకెక్కిన సినిమా 'గాడ్'. అహ్మద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధన్‌ సుందరం, జి.జయరామ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇది తమిళ సినిమా 'ఇరైవన్'​కు తెలుగు డబ్బింగ్.

వెయ్ దరువెయ్.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్‌ శంకర్‌ కొత్త చిత్రం 'వెయ్ దరువెయ్'. ఈ సినిమాను డైరెక్టర్ నవీన్‌ రెడ్డి తెరకెక్కించగా.. దేవరాజు పొత్తూరు రూపొందించారు. నటి యాశ శివకుమార్‌ ఈ సినిమాలో సాయిరామ్​కు జోడీగా నటించింది. ఇక సీనియర్ కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం అక్టోబరు 13 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

మధురపూడి గ్రామం అనే నేను.. శివ కంఠమనేని హీరోగా నటించిన సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. ఓ గ్రామం బయోపిక్‌గా.. దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.

ప్రేమ విమానం.. టాలీవుడ్ యంగ్ హీరో సంతష్ శోభన్ సోదరుడు.. సంగీత్‌ శోభన్‌ వెబ్​ సిరీస్ 'ప్రేమ విమానం'. ఈ సినిమాలో సంగీత్​కు జంటగా నటి శాన్వీ మేఘన నటిస్తోంది. సంతోష్‌ కట ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైఫ్​లో ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకునే కొందరి జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ఇది. బుల్లితెర యాంకర్ అనసూయతో పాటు ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్‌, దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ ఈ సిరిస్​లో ప్రధాన పాత్రలు పోషించారు.ఇది జీ5 ఓటీటీ వేదికగా అక్టోబర్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అక్టోబర్ 13న రానున్న మరికొన్ని సినిమాలు..

Last Updated : Oct 9, 2023, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.