ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్‌ను రెడ్ కార్పెట్‌పై ఓ హాలీవుడ్ యాంకర్ ఇంటర్వ్యూ చేయగా.. తారక్ అమెరికన్ ఇంగ్లిష్ యాక్సెంట్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగా.. అది చూసిన పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా తన యాసను విమర్శించిన వారికి గట్టి సమాధానం ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒక్కో దేశంలో ఒక్కో యాస ఉండటం సహజమని అన్నారు. "కాలమానం, యాసల పరంగానే మన మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. కానీ, పశ్చిమ దేశాల్లో ఒక నటుడు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో తూర్పు దేశాల్లోనూ అదే విధంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.
ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. "రాజమౌళి గొప్ప వ్యక్తి. తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని అలంరించిన వ్యక్తి. ప్రతి చిత్రంతో ఆయన మరింత వృద్ధి చెందుతున్నారు. పశ్చిమ దేశాల్లోనూ పేరు సొంతం చేసుకునేలా ఆయన చేసిన ఆలోచన 'ఆర్‌ఆర్‌ఆర్'. దక్షిణాదిలోని టాలీవుడ్ అనే చిన్న పరిశ్రమకు చెందిన మేము.. 'ఆర్‌ఆర్‌ఆర్' కారణంగా ఈ స్థాయికి చేరుకోవడం.. ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా పేరు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా దాదాపు రూ.1200కోట్ల వరకు వసూలు చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు రాగా.. ఇటీవలే 'నాటు నాటు' సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో రెండు పురస్కారాలను దక్కించుకుంది.
-
#NTR @tarak9999 about being part of #RRRMovie #GoldenGlobes2023
— Suresh Kondi (@SureshKondi_) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/9Z64o0M9Zf
">#NTR @tarak9999 about being part of #RRRMovie #GoldenGlobes2023
— Suresh Kondi (@SureshKondi_) January 11, 2023
pic.twitter.com/9Z64o0M9Zf#NTR @tarak9999 about being part of #RRRMovie #GoldenGlobes2023
— Suresh Kondi (@SureshKondi_) January 11, 2023
pic.twitter.com/9Z64o0M9Zf
ఇదీ చూడండి: నటి అమలా పాల్‌కు చేదు అనుభవం.. అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు