ETV Bharat / entertainment

NTR Cameo role : 'సలార్'​ - 'టైగర్​ 3'లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత? - salaar updates

NTR Cameo role : యంగ్ టైగర్ ఎన్టీఆర్​.. సల్మాన్​ టైగర్​ 3, ప్రభాస్ సలార్​లో గెస్ట్ రోస్​ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. అందులో నిజమెంత?

NTR Cameo role
NTR Cameo role
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 5:50 PM IST

NTR Cameo role : 'ఆర్​ఆర్​ఆర్'​ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్​ హిట్​​ తర్వాత జూనియర్​ ఎన్టీఆర్ లైనప్ భారీగా పెరిగిపోయింది. భారీ బడ్జెట్​ చిత్రాలను ఒప్పుకున్నారు. అందులో 'వార్ 2' కూడా ఒకటి. ఈ చిత్రంతోనే ఆయన బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. వైఆర్​ఎఫ్​ స్పై యూనివర్స్ బ్యానర్​లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ సినిమా కంటే ముందే ఇదే బ్యానర్​లో తెరకెక్కిన సల్మాన్ 'టైగర్​ 3'తో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో ఆయన షారుక్​- హృతిక్​తో పాటు గెస్ట్​ రోల్​లో కనిపిస్తారని అంతా అంటున్నారు.

NTR WAR 2 Movie : అయితే ఇది ఇప్పుడు నిజం కాదని తెలిసింది. ఇందులో తారక్-హృతిక్​ నటించట్లేదట. షారుక్​ మాత్రమే అతిథి పాత్రలో ఓ 20 నిమిషాల పాటు కనిపించనున్నారని తెలిసింది. అలాగే కేజీయఫ్ ఫేమ్​ ప్రశాంత్​ తాజాగా డైరెక్ట్​ చేసిన సినిమా 'సలార్​'లోనూ తారక్ కనిపిస్తారని అంటున్నారు. మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర క్లైమాక్స్​లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్​లో​ హీరో యశ్​తో పాటు కలిసి జూనియర్ ఎన్టీఆర్​ సర్ప్రైజ్ క్యామియో రోల్​ చేస్తారని అంటున్నారు. మరి ఇందులో కూడా నిజమెంతో తెలీదు కానీ ఈ వార్తలను కొట్టి పారేయలేం అని సినీ వర్గాలు అంటున్నాయి.

NTR Salaar Movie : ఎందుకంటే ప్రశాంత్​.. తన తర్వాతి లైనప్​లో ఎన్టీఆర్​తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ఇది ఆయన యూనివర్స్​ భాగంలోనే రావొచ్చు. కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా షూటింగ్​తో ఫుల్ బిజీగా గడపుతున్నారు.ఈ చిత్రం షూటింగ్​ నవంబర్ నెలలో పూర్తి కానుందట. ఆ వెంటనే.. హిందీ సినిమా 'వార్​ 2' షూటింగ్​ సెట్స్​లో జాయిన్ అవుతారని తెలిసింది. అది కూడా పూర్తయ్యాక... ప్రశాంత్​ నీల్​ మూవీని సెట్స్​పైకి తీసుకెళ్తారని సినీ వర్గాలు అంటున్నాయి.

Salaar Ugramm Remake : 'సలార్'​.. ఉగ్రమ్ రీమేక్ ప్రచారంలో నిజమెంత?

మళ్లీ డబ్బింగ్ చిత్రాలదే డామినేషన్​.. రాబోయే పండక్కి ఏం రిలీజ్ కానున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.