ETV Bharat / entertainment

'NTR 30'కి​ అదిరిపోయే టైటిల్​.. ఫ్యాన్స్​కు పూనకాలే.. రివీల్​ అప్పుడే! - NTR30 Title Revealed As Devara

NTR 30 Title Name : జూనియర్ ఎన్టీఆర్​, స్టార్​ డైరెక్టర్​ కొరటాల శివ కాంబినేషన్​లో వస్తున్న 'ఎన్టీఆర్​ 30' సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ వచ్చింది. అదేంటంటే..

NTR30 Title Revealed As Devara
NTR30కి​ 'దేవర' పేరు​ ఖరారు.. ఆయన బర్త్​డే రోజే రివీల్​..?
author img

By

Published : May 15, 2023, 9:43 PM IST

NTR 30 Title Name : 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన నటన, డ్యాన్స్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్​ ప్రస్తుతం స్టార్​ డైరెక్టర్​ కొరటాలి శివతో కలిసి భారీ పాన్​ ఇండియా యాక్షన్​ చిత్రం 'ఎన్టీఆర్​ 30'లో నటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్​ బయటకు వచ్చింది. ఈ సినిమాకు ఓ పవర్​ఫుల్​ టైటిల్​ను దర్శకుడు కొరటాల శివ ఫిక్స్​ చేసినట్లుగా వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అనేక పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు ఈ చిత్రానికి 'దేవ‌ర' అనే టైటిల్​ను ఖరారు చేసినట్లు పెద్దఎత్తున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పేరుకు సినిమా నిర్మాతలు సహా హీరో ఎన్టీఆర్​ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ఎన్టీఆర్​ పుట్టినరోజైన మే20న వెల్లడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా టైటిల్​తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్​ను కూడా చిత్రబృందం రిలీజ్​ చేయనున్నట్లు టాక్​. మరి ఇవన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఎన్టీఆర్ బర్త్​డే వరకు ఆగాల్సిందే.

ఇక 'ఎన్టీఆర్​ 30' విషయానికొస్తే..ఈ సినిమాను సుధాకర్​ మిక్కిలినేని, కల్యాణ్​ రామ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్​ హీరోయిన్​గా నటిస్తోంది​. స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్​ పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాను మరింత బెస్ట్​గా తీర్చిదిద్దేందుకు హాలీవుడ్​ స్థాయిలో టెక్నిషియన్లను కూడా తీసుకున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్​ కాస్త డిఫరెంట్​ లుక్​లో కనిపించనున్నారట. ఇందుకోసం ప్రముఖ హేర్ డ్రెస్సర్​ అలీమ్ హ‌కీమ్​ను నియమించుకున్నారని ప్రచారం. ఇప్పటికే ఎన్టీఆర్​, కొరటాల కాంబినేషన్​లో వచ్చిన 'జనతా గ్యారేజ్' పెద్ద హిట్​గా నిలిచింది. దీంతో రాబోయే చిత్రంపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు ఫ్యాన్స్.

రామోజీ ఫిల్మ్​ సిటీలో షూటింగ్!
'ఎన్టీఆర్​ 30' ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తాజాగా ప్రముఖ పర్యటక ప్రదేశం రామోజీ ఫిల్మ్​ సిటీలో ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్​ను ఖరారు చేశారు మూవీ మేకర్స్. దీంట్లో భాగంగా ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్‌ సీన్​లను షూట్ చేయనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

కీలక పాత్రలో సీనియర్​ స్టార్​ హీరో!
ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఓ సీనియర్​ స్టార్​ హీరో​ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నటుడు ఎవరా అనేది తెలియాలి. కాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్​గా అనన్య పాండే​ కూడా నటించనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.