New Year Week OTT Release: 2023 సంవత్సరానికి ముగింపు పలికి 2024 లోకి అడుగుపెట్టాం. తెలుగులో గతేడాది 250+కి పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, మరికొన్ని యావరేజ్ టాక్ అందుకున్నాయి. ఇక టాలీవుడ్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల ప్రాధాన్యం కూడా పెరిగింది. 2023లో ప్రముఖ హీరో, హీరోయిన్లు సైతం వెబ్‌సిరీస్‌ల్లో మెరిశారు. అందులో ముఖ్యంగా ఏడాది చివర్లో అక్కినేని నాగచైతన్య 'దూత' వెబ్‌సిరీస్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.
మరోవైపు స్టార్ హీరోయిన్ తమన్నా కూడా పలు వెబ్‌సిరీస్‌లో నటించి అలరించింది. ఇక 2024లోనూ అనేక సినిమాలు, పలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ నెలలో పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలోనే ఉండనున్నాయి. కొత్త సంవత్సరం తొలివారంలో ఒకటి రెండు మినహా ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో సినీ ప్రేక్షకులందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీ వైపు మళ్లింది. ప్రతివారం లాగే ఈవారం కూడా 10కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. మరి అవేంటంటే?
హాయ్ నాన్న: నేచురల్ స్టార్ నాని- మృణాల్ ఠాకూర్ ఫీలింగ్ లవ్ స్టోరీ 'హాయ్ నాన్న'. ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో నాని 2023లో రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా 2024 జనవరి 4నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాలింగ్ సహస్ర: స్టార్ కమెడియన్ సుధీర్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'కాలింగ్ సహస్ర'. ఈ సినిమా కొత్త సంవత్సరం కానుకగా 2024 జనవరి 1 నుంచి ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తేజస్: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా'తేజస్'. ఈ సినిమాలో కంగనా ఫైలట్‌గా కనిపించారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి సవేశ్ మేవరా దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా జీ 5 (Zee 5)లో జనవరి 05 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నెట్‌ఫ్లిక్స్
- కంజూరింహ్ కన్నప్పన్ (తెలుగు డబ్)- జనవరి 05
- బిట్ కాయిన్ (ఇంగ్లీష్)- జనవరి 01
- అమెజాన్ ప్రైమ్
- మ్యారీ మై హస్బెండ్ (కొరియన్)- జనవరి 01
- జేమ్స్ మే (ఇంగ్లీష్)- జనవరి 05
సోనీ లివ్
- క్యూబికల్ సీజన్ (హిందీ)- జనవరి 05
జియో సినిమా
- మెగ్ 2 (తెలుగు డబ్)- జనవరి 03
హిట్ కోసం ఒకరు, బోణీ కోసం మరొకరు - 2023లో లాస్ట్ సినిమాలు ఇవే!
ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే.. మీరేం చూస్తారు?