ETV Bharat / entertainment

'సీతా నీ కన్నీరు కనిపిస్తోంది.. పిలుపు వినిపిస్తోంది'.. సీతారామంపై మనసు పారేసుకుంటున్న నెటిజన్లు!

ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన మధుర కావ్యం 'సీతా రామం'. ఇంతకాలం థియేటర్లలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన ప్రతి మాటా.. పలికించిన ప్రతి భావాన్నీ నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వాటిని చూసేద్దాం రండి.

netizens-shows-love-on-sita-ramam-dialogues

author img

By

Published : Sep 10, 2022, 1:15 PM IST

SitaRamam Movie : 'సీతా రామం'.. ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన మధుర కావ్యం. హను రాఘవపూడి దర్శకుడు. ఇంతకాలం థియేటర్లలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని అభిమానించే వారి సంఖ్య మరింత పెరిగింది. సీతా, రామ్‌గా మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన ప్రతి మాటా.. పలికించిన ప్రతి భావాన్నీ నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

'సీతా రామం'
'సీతా రామం'

ముఖ్యంగా.. "కనిపిస్తోంది.. కన్నీళ్లతో ఈ ఉత్తరం తడిచిపోవడం.. తుడిచేసుకో.. వినిపిస్తోంది నన్ను తిరిగి రమ్మనే నీ పిలుపు.. నా చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చెరిపేస్తోంది", "నెలకి రూ.600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి.. ఈ జన్మకి ఇక సెలవు" అనే డైలాగ్స్‌ కన్నీళ్లు పెట్టిస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. అద్భుతమైన సంభాషణలు రాసిన హను రాఘవపూడి, జై కృష్ణ, రాజ్‌కుమార్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంటర్వెల్‌ సీన్‌తోపాటు కశ్మీర్‌లో సీతారామ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్‌ అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా (ఇండియా) ట్రెండింగ్‌ వన్‌లో ఉంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై సిద్ధమైన ఈ చిత్రాన్ని అశ్వనీ దత్‌ నిర్మించారు. రూ.30 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.80 కోట్లు వసూళ్లు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్' రికార్డు​ బద్దలు కొట్టిన 'బ్రహ్మాస్త్ర'.. తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

''సీతారామం' క్లైమాక్స్​లో ఆ మార్పు చేసి ఉంటే సినిమా వేరే లెవల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.