ETV Bharat / entertainment

Nelson Simbu Movie : 'జైలర్'​ డైరెక్టర్​తో శింబు మూవీ.. మరి హన్సిక సంగతేంటి..? - నెల్సన్ దిలీప్ కుమార్ అప్​కమింగ్​ మూవీస్​

Nelson Simbu Movie : తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ ప్రస్తుతం 'జైలర్'​ సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో తన నెక్స్ట్​ ప్రాజెక్టుల విషయంలో ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. ​ అయితే అప్పట్లో శింబుతో తీయాలనకున్న ఓ సినిమా త్వరలో సెట్స్​పైకి రానుందట. ఆ విశేషాలు మీ కోసం..

Nelson Simbu Movie
Nelson Simbu Movie
author img

By

Published : Aug 12, 2023, 10:37 AM IST

Nelson Dilipkumar Vettai Mannan Movie : నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసిన 'జైలర్'​ మేనియానే నడుస్తోంది. సూపర్​ స్టార్ రజనీకాంత్​ లీడ్​ రోల్​లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్​ను షేక్​ చేస్తూ మంచి టాక్​ అందుకుంటోంది. కలెక్షన్ల పరంగానూ ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. తొలి రోజు అనూహ్య కలెక్షన్స్​ సాధించిన సినిమా వీకెండ్స్​లోనూ అదే జోరును కొనసాగించేలా ఉంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్​ కుమార్​పై అభిమానులు, సెలబ్రిటీలు ప్రసంశల జల్లును కురిపిస్తున్నారు.

2018లో నయనతార లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'కోలమావు కోకిల' అనే సినిమాతో మెగాఫోన్​ పట్టిన నెల్సన్​.. ఆ తర్వాత శివ కార్తికేయన్​తో 'డాక్టర్‌', దళపతి విజయ్​తో 'బీస్ట్‌' సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత ఇప్పుడు జైలర్​తో సాలిడ్​ హిట్​ను తన ఖాతాలోకి వేసుకున్నారు. తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

Vettai Mannan Movie Cast : అయితే నెల్సన్​.. 'కొలమావు కోకిల' కంటే ముందే శింబు- హన్సిక కాంబోలో 'వేట్టై మన్నన్‌' అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. 2010లో ఈ సినిమాతోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. అయితే కొంత భాగం షూటింగ్​ జరుపుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోయింది.

ఆ తర్వాత 2017లో మరోసారి ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇక అప్పుడు కూడా ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లుకుండానే ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ ఈ సినిమాను పూర్తి చేయాలని నెల్సన్​ అనుకుంటున్నారట. ఇదే విషయమై హీరో- శింబు దర్శకుడు నెల్సన్‌ చర్చలు జరిపారట. ఒకవేళ ఇది నిజమైతే.. ఇక హీరోయిన్​ ప్లేస్​లో ఎవరిని తీసుకుంటారన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి హీరోయిన్​ హన్సిక సంగతి ఏంటి అని ఫ్యాన్స్​ అనుకుంటున్నారు.

అప్పట్లో హన్సిక-శింబు లవ్​ చేసుకున్న విషయం అందికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్​పై కనిపించలేదు. కానీ హన్సిక హీరోయిన్​గా వచ్చిన 'మహా' అనే సినిమాలో శింబు గెస్ట్​ రోల్​లో కనిపించారు. ఈ క్రమంలో ఈ జంట 'వేట్టై మన్నన్‌' సినిమాను కలిసి పూర్తి చేస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు నెట్టింట తెగ హల్​చల్​ చేస్తోంది.

Jailer Director Next Movie : మరోవైపు 'జైలర్' సినిమా సక్సెస్​ను అందుకున్న నెల్సన్‌.. ఇప్పుడు ధనుశ్​తో ఓ సినిమా తీసేందుకు ప్లాన్​ చేస్తున్నారట. దీంతో ఆయన నెక్స్ట్​ ఏ ప్రాజెక్ట్ చేయనున్నారన్న విషయం తెలియాలంటే ఈ రెండు అప్డేట్స్​పై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

''జైలర్‌'లో పోలీస్​ పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నా.. ఫ్యూచర్​లో ఆయనతో సినిమా పక్కా!'

'105 మినిట్స్​'లో హన్సిక ఏకపాత్రాభినయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.