ETV Bharat / entertainment

అది చిన్న విషయం కాదు.. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా: నయనతార - నయనతార కనెక్ట్ సినిమా రివ్యూ

'కనెక్ట్'​ మూవీ పాజిటివ్​​ టాక్​ తెచ్చుకున్న నేపథ్యంలో స్పందించింది హీరోయిన్ నయనతార. కనెక్ట్​ సినిమా సక్సెస్​తో పాటు తన కెరీర్​, కొత్త సినిమాల గురించి కూడా మాట్లాడింది. ఆ సంగతులు..

nayantara connect movie success
అది చిన్న విషయం కాదు.. చాలా నేర్చుకున్నా: నయనతార
author img

By

Published : Jan 2, 2023, 3:10 PM IST

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన కొత్త చిత్రం కనెక్ట్‌. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్‌ మూవీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. తాజాగా ఈ విజయంపై స్పందించిన నయన్​ హర్షం వ్యక్తం చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తోందని తెలిపింది. ఈ ఏడాది పూర్తిస్థాయి బాలీవుడ్‌ సినిమాల్లోనే నటిస్తున్నట్లు పేర్కొంది. ఇక 'కనెక్ట్‌' సినిమాను బీటౌన్‌లోనూ విడుదల చేయడం పై మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ చిత్రం చిన్నదా.. పెద్దదా లేదా పాన్‌ ఇండియా స్థాయా అని ఆలోచించడం లేదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు సినీప్రియులందరూ కథ బాగుంటే ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అందుకే మేం కనెక్ట్‌ మూవీని మూడు భాషల్లో విడుదల చేశాం. ప్రేక్షకులు దీనిని మంచి సినిమా అని భావించారు. అందుకే విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి విజయాన్ని అందించారు" అని చెప్పింది.

తన ఇరవై ఏళ్ల సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "చిత్ర రంగంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగడమన్నది చిన్న విషయం కాదు. నా సినీ ప్రయాణంలోనూ ఒడుదొడుకులున్నాయి. ఇప్పుడు అంతా బాగుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని వివరించింది. తనను ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. విజయంతోపాటు బాధ్యత మరింత పెరుగుతుందని, తన ప్రమాణాలను ఎప్పుడూ కాపాడుకుంటానని పేర్కొంది.

ప్రస్తుతం నయన్​ బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్ ఖాన్‌ నటిస్తున్న జవాన్‌ సినిమాలో నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ అతిథి పాత్రలో మెరవనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి: 2023లో ఫ్యాన్స్​ రాసిపెట్టుకున్న మూవీస్ ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.