ETV Bharat / entertainment

నయన్‌-విఘ్నేశ్‌ సరోగసీ.. విచారణ కమిటీ నివేదికలో ఏం చెప్పిందంటే? - నయనతార సరోగసి వివాదం

నయనతార, విఘ్నేశ్​ శివన్​ల సరోగసీపై విచారణ కమిటీ తమిళనాడు ఆరోగ్య శాఖకు నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఏం చెప్పిందంటే..

Nayantara vignesh surogacy
నయన్‌-విఘ్నేశ్‌ సరోగసీ
author img

By

Published : Oct 26, 2022, 8:59 PM IST

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల సరోగసీ చట్టబద్ధమే అని తమిళనాడు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ వెల్లడించింది. 2021 ఆగస్టులో నయన్‌ దంపతులు సరోగసీ ప్రక్రియ ప్రారంభించారని, అదే ఏడాది నవంబరులో ఒప్పందం కుదిరిందని కమిటీ పేర్కొంది. ఈ మేరకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఓ నివేదికను సమర్పించింది. 2016 మార్చి 11న తమ వివాహం (రిజిస్టర్‌ విధానంలో) అయినట్టు నయన్‌, విఘ్నేశ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు కమిటీ నివేదికలో పేర్కొంది. నిబంధలన్నింటినీ అనుసరించారని తెలిపింది. ఎందుకు సరోగసీ పద్ధతిని ఎంపిక చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు.

సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. తమకు కవలలు (ఇద్దరు అబ్బాయిలు) పుట్టారని తెలియజేస్తూ అక్టోబర్‌ 9న సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. సరోగసీ అయినా.. వివాహమైన నాలుగు నెలల్లోనే అదెలా సాధ్యమైదంటూ పలువురు నెటిజన్లు చర్చ సాగించారు. భారతదేశంలో సరోగసీ విధానంపై నిషేధం ఉందని.. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారంటూ ప్రశ్నించారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: నేను దానికి బానిసను.. ఎప్పుడూ అదే చేస్తుంటా: రకుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.