ETV Bharat / entertainment

రావణుడి ఎదుట ఊర మాస్​ లుక్​లో నాని.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే - నాని దసరా సాంగ్స్​

నేచురల్​ స్టార్​ నటించిన పాన్​ ఇండియా మూవీ 'దసరా'. ఇప్పటికే టీజర్​తో మంచి క్రేజ్​ సంపాదించుకున్న మూవీ నుంచి మరో లేటెస్ట్​ అప్డేట్​ను రిలీజ్​ చేసేందుకు రెడీగా ఉంది మూవీ టీమ్​. అదేంటంటే...

nani dasara movie
nani dasara movie trailer update
author img

By

Published : Mar 12, 2023, 7:08 AM IST

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్​ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దసరా'. ఇప్పటికే టీజర్​తో పాటు మూవీ పోస్టర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టేసింది మూవీ టీమ్​. దీంతో ఫ్యాన్స్​ అందరూ ట్రైలర్​ అప్డేట్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సమయంలో ఓ గుడ్​ న్యూస్​ చెప్పింది మూవీ టీమ్​. ట్రైలర్​ రిలీజ్​ డేట్​ను అనౌన్స్​ చేసింది. ఇక హీరో నాని కూడా 'జాతర షురూ' అంటూ ట్రైలర్​ అప్డేట్​ ఉన్న ఓ పోస్టర్​ను తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశారు.

అందులో రావణాసురుడి భారీ విగ్రహానికి నిప్పంటుకుంటుండగా దాని ఎదుట చేతిలో రెండు గొడ్డళ్లు పట్టుకుని ఊర మాస్​ లుక్​లో నాని నిల్చుని ఉన్నారు. ఇక అదే పోస్టర్​లో ట్రైలర్​ మార్చి 14న రిలీజవ్వనున్నట్లు రాసి ఉంది. అయితే ఏ టైమ్​లో రిలీజవుతుందో అనే విషయాన్ని మేకర్స్​ ఇంకా తెలియజేయలేదు. ఇక ఈ పోస్టర్​ను చూసిన అభిమానులు ట్రైలర్ ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.​

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నేచురల్​ స్టార్​ నాని. ఇది ఆయన మొదటి పాన్​ ఇండియా సినిమా కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆయన కూడా సినిమా ప్రమోషన్లను దగ్గరుండి చూసుకుంటూ ఇటు సౌత్​తో పాటు అటు నార్త్​లోనూ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు. ఇక సినిమాలోని పాటలు కూడా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజైన మూడు పాటలకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. టీజర్​ అయితే మరో లెవెల్​లో ఉంది. వీటన్నింటి వల్ల ఈ సినిమాకు మరింత హైప్​ పెరిగింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. కొత్త డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవెల్​లో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో నేచురల్​ స్టార్​ నాని సరసన కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. కాగా మరో కీలక పాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటించారు. ఇక తమిళ స్టార్​ సముద్రఖనితో పాటు సాయి కుమార్, జరీనా వహాబ్​లు కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్​ నారాయణ్​​ మ్యూజిక్​ అందించగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.