ETV Bharat / entertainment

నరేశ్​-పవిత్ర 'లవ్​'స్టోరీ.. వివాదాలతో మొదలై.. తియ్యని వేడుకతో చెక్​ పెట్టి.. - నరేశ్ పవిత్రా లోకేష్ మ్యారేజ్​

చాలా కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్న నరేశ్​-పవిత్రా లోకేశ్​ జంట.. తాజాగా మరోసారి తియ్యని వేడుక చేసుకుందామంటూ వార్తల్లోకి ఎక్కారు. తమ పెళ్లి ప్రకటనతో అందర్నీ షాక్ చేశారు. దీంతో ప్రస్తుతం వారిద్దరూ మరోసారి సోషల్​మీడియాలో ఫుల్​ ట్రెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం..

Naresh pavitra lokesh releationship marriage confirmed
నరేశ్​-పవిత్ర
author img

By

Published : Dec 31, 2022, 2:42 PM IST

కొత్త సంవత్సరం 'తియ్యని వేడుక చేసుకుందాం'.. ప్రస్తుతం ఇది సీనియర్​ నటుడు నరేశ్​-నటి పవిత్ర లోకేశ్​కు సరిగ్గా సెట్​ అయిపోతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా తమ రిలేషన్​షిప్ గురించి అధికారికంగా ప్రకటించి అందర్నీ సర్​ప్రైజ్​తో పాటు షాక్​కు గురిచేశారు. ఎందుకంటే ఎన్నో వివాదాలు, విమర్శల నడుమ సీక్రెట్​గా సాగిన వీరి రిలేషన్​షిప్​ టాలీవుడ్​-2022లో హాట్​ టాపిక్​గా నిలిచింది. నరేశ్​-అతడి మూడో భార్య రమ్య- పవిత్ర- పవిత్ర భర్త.. మీడియా ముందుకు వచ్చి ఒకరి గురించి ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసిన వీళ్ల గురించే చర్చ. వార్తల్లో బాగా ట్రెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పి తమ పెళ్లి ప్రకటనతో అందరిని షాక్​కు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే అసలు మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఎక్కడ చూసినా వీళ్లే.. నరేశ్​-పవిత్రా.. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో జంటగా నటించారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ జంట సహజీవనం చేస్తున్నారని, వివాహం చేసుకోబోతున్నారని కొంత కాలం నుంచి జోరుగా ప్రచారం సాగింది. సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన వీరి గురించే అనేక కథనాలు వచ్చాయి. ఈ పుకార్లకు ఊతం ఇస్తూ.. నరేశ్​-పవిత్రా.. పలు ప్రైవేట్​ ఈవెంట్లతో పాటు గుడి గోపురాల్లో కనిపించడం వల్ల.. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త ఊపందుకుంది.

ఈ రూమర్స్​ వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నరేశ్​ పెళ్లి గురించి మాట్లాడుతూ... "సినిమా వాళ్ల పెళ్లిళ్లు బయటికి కనిపిస్తాయి, మిగతా వాళ్లవి కనిపించవు. పెళ్లి అనేది ఆట కాదు. అది ఒక జీవితం. లైఫ్​లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే అందులో నుంచి బయటకు వస్తారు. భవిష్యత్​లో మ్యారేజ్​ వ్యవస్థ ఉండకపోవచ్చు. ఓ నటుడికి స్థిరత్వం ఉండదు. సమయానికి ఇంటికి రారు. నేను నెలలో 28 రోజులు షూటింగ్​లలో ఉంటాను. ఇప్పటికీ నా మొదటి భార్య సినిమానే. నా వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునే వారితోనే కలిసి జీవించగలను" అని నరేశ్ అన్నారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్​టాపిక్​గా మారాయి.

మూడో భార్యకు విడాకులు.. ఈ నేపథ్యంలో నరేశ్​ భార్య రమ్య రఘుపతి కర్ణాటకలో పవిత్ర-నరేశ్​ వ్యవహారంపై స్పందించారు. ''నరేశ్​తో నాకు సత్సంబంధాలు లేవు. నాకు ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు. మ్యారేజ్‌ కోసం ఎలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ఆయనకు మ్యారేజ్‌ అయితే నా పరిస్థితి ఏంటి?.. పవిత్రతో పెళ్లైంది కాబట్టే ఆయన అలా అన్నారు. నరేశ్‌ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మూడేళ్ల నుంచి మా మధ్య విభేదాలున్నాయి. న్యాయపరంగా విడాకులు తీసుకోవడమనేది చాలా పెద్ద ప్రక్రియ. అందుకు సమయం పడుతుంది. ఈ ఏడాది జనవరిలోనే నరేశ్‌ నాపై కేసు పెట్టారు. అప్పుడు నేను ఇంట్లో ఉన్నా. నోటీసులు నా వరకు రాకుండా గేటు దగ్గర నుంచే వెనక్కి పంపారు. దేవుడి దయ వల్ల జూన్‌లో పోస్టు మాస్టర్ నా నంబర్‌కు కాల్ చేసి చాలా సమన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆ కోర్టు సమన్లు అన్నీ బెంగళూరు అడ్రస్‌కు పంపమని కోరా. నాకు పంపిన సమన్లపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నా. త్వరలో దీనిపై స్పందిస్తా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది'' అని అన్నారు.

ఖండించిన నరేశ్​.. అయితే రమ్య రఘుపతి చేసిన ఆరోపణలను నటుడు నరేశ్‌ ఖండిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ''రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదు. బెంగళూర్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ నాపై వదంతులు సృష్టిస్తోంది. రూ.50 లక్షల కోసం నా ఇంట్లో వాళ్లను రమ్య పీడించింది. ఆమెకు విడాకుల నోటీసు పంపి నెల రోజులు దాటింది. విడాకుల నోటీసు పంపిన తర్వాత నాకు పెళ్లి కాబోతోందని రూమర్స్ క్రియేట్ చేసింది. కన్నడ మీడియాలో ఆ అంశంపై పూర్తి వివరణ ఇచ్చా. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరం. ఈ వివాదంలోకి పవిత్ర లోకేశ్​ను ప్రస్తావిస్తూ రూమర్స్ క్రియేట్ చేయడం చాలా తప్పు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్‌లో నేను ఎంతోమంది హీరోయిన్స్‌తో కలిసి పనిచేశా. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నాకు గతంలో పెళ్లిళ్లు అయి ఉండొచ్చు. వాళ్లే నన్ను వదిలేసి వెళ్లిపోయారు. అది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే నేను రాజకీయాలు, సామాజిక సేవలో ఎంతో బిజీ జీవితం గడిపా. రమ్య రఘుపతి నా జీవితాన్ని నాశనం చేశారు'' అని అన్నారు.

సపోర్ట్ కావాలి.. ఇకపోతే రమ్య ఆరోపణలపై పవిత్రా లోకేశ్​ కూడా స్పందించారు. రమ్య హైదరాబాద్​ నుంచి వచ్చి బెంగుళూరులో ప్రెస్​మీట్​ పెట్టి తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏదైనా ఉంటే.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్​లో తేల్చుకోవాలి కానీ.. తనను బ్యాడ్​ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'నరేశ్‌ చాలా మంచి వ్యక్తి. ఆయనకు నాకూ మధ్య ఎలాంటి దాపరికాలూ లేవు. రమ్యకి నరేశ్‌తో సమస్య ఉంటే హైదరాబాద్‌లో చూసుకోవాలి. కేవలం నేమ్‌, ఫేమ్‌ కోసం రమ్య మీడియా ముందుకు వస్తున్నారు. నాకు, నరేశ్​కు మీ సపోర్ట్​ కావాలి' అని పేర్కొన్నారు.

కాపురాలు కూల్చడం అలవాటే.. ఈ వివాదాల నడుమే సడన్​ ఎంట్రీ ఇచ్చిన ప‌విత్రా లోకేశ్​ భర్త సుచేంద్ర ప్ర‌సాద్ రమ్య చేసిన ఆరోపణలకు మద్దతూ పలుకుతూ.. ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప‌విత్రా లోకేశ్​కు కాపురాలు కూల్చ‌టం అల‌వాటేనన్నారు. అందుక‌నే త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోయినట్లు చెప్పారు.

రెడ్ హ్యాండెడ్​గా దొరికిన నరేశ్.. పవిత్రపై చెప్పుతో.. ఇకపోతే ఓ సారి మైసూర్​లో నరేస్​- పవిత్ర ఓ అపార్ట్ మెంట్​లో ఉండగా.. నరేశ్​ మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్రను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. అయితే అక్కడనున్న నరేశ్​.. రమ్యను కవ్వించే ప్రయత్నాలు చేశారు. ఆమె వైపు చూస్తూ విజిల్స్ వేసుకుంటూ వెళ్లారు. అలా ఈ వివాదం కొనసాగింది. ఇక ఈ గొడవ తర్వాతే వీరి రిలేషన్​ మరింత పెరిగింది. అఫిషియల్‌గానే నరేష్, పవిత్ర కలిసి తిరగడం మొదలుపెట్టారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించనప్పుడు కూడా అంత్యక్రియల సమయంలోనూ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు.

సోషల్​మీడియాలో ఫుల్​ ట్రోల్​.. ఆ ఛానల్స్​పై కేసు.. ఇక ఈ వ్యవహారలన్నీ జరుగుతుండగా కూడా నరేశ్​-పవిత్ర కలిసి సినిమాల్లో నటించారు. సోషల్​ మీడియాలో ఫుల్ ట్రోల్​ అయ్యారు. వీరి రిలేషన్​షిప్​ గురించి రకరకాల వార్తలు యూట్యూబ్​లో తెగ వచ్చాయి. నెట్టింట్లో ఎక్కడ చూసిన వీరి మీమ్సే కనిపించేవి. ఈ క్రమంలోనే ఈ జంట పలు సందర్భాల్లో సైబర్​ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫైనల్​గా లిప్​కిస్​తో.. మొత్తంగా 2022లో ఇన్ని వివాదాలను ఎదుర్కొన్న వీరిద్దరు సక్సెస్​ఫుల్​గా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో తమపై వస్తున్న విమర్శలకు నరేశ్​, పవిత్రలు ముగింపు పలికారు. త్వరలోనే తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నరేశ్​ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తమ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కటిస్తూ చేస్తూ... త్వరలోనే పవిత్రను తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు నరేశ్​ ప్రకటించారు. "కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం" అని ఆయన పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాష్‌ట్యాగ్‌ను దీనికి జత చేశారు.

ఇదీ చూడండి: నటి పవిత్రతో పెళ్లి.. లిప్​ కిస్​తో కన్ఫామ్​ చేసిన నరేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.