ETV Bharat / entertainment

'దసరా'తో నాని నయా హిస్టరీ.. పవన్​, ప్రభాస్​ రికార్డ్​లు బ్రేక్​.. యూట్యూబ్​ షేక్! - నాని దసరావాైర్తలు

నాని హీరోగా న‌టించిన ద‌స‌రా సినిమా ఓవ‌ర్‌సీస్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌నుంది. ఆ సంగతులు..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 15, 2023, 4:26 PM IST

టాలీవుడ్​ నేచురల్​ స్టార్​ నాని.. త్వరలోనే దసరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ఊరమాస్​ లుక్​లో కనిపించనున్నారు. భారీ అంచనాలతో ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. టాలీవుడ్​కు కొత్తగా పరిచయమవుతున్న దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

అయితే అమెరికాలో థియేట‌ర్ల సంఖ్య ప‌రంగా బాహుబ‌లి 2, అజ్ఞాతవాసి, సాహో రికార్డులను నాని ద‌స‌రా చిత్రం బ్రేక్​ చేయనుంది. అమెరికాలో నాని ద‌స‌రా మూవీ 600ల‌కుపైగా లొకేష‌న్స్‌లో రిలీజ్ కానుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్​ అజ్ఞాతవాసి సినిమా 550 లొకేష‌న్స్‌లో రిలీజ్ కాగా.. ప్రభాస్​ బాహుబ‌లి 2 ఐదు వంద‌ల‌కుపైగా లొకేష‌న్ల‌లో రిలీజైంది. స్క్రీన్ లొకేష‌న్స్ విష‌యంలో ప‌వ‌న్‌, ప్ర‌భాస్ సినిమాల రికార్డ్‌ను నాని బ్రేక్ చేయ‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ త‌ర్వాత అమెరికాలో అత్య‌ధిక లొకేష‌న్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమా ద‌స‌రానే కావ‌డం గ‌మ‌నార్హం.

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న 'దసరా' ట్రైలర్‌
నేచురల్‌ స్టార్‌ నాని, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటించిన దసరా సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఇలా విడుదలైందో లేదో క్షణాల్లో ఈ ట్రైలర్‌ వేలల్లో వ్యూస్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌ విడుదలైన 16 గంట్లోనే 5 భాష్లలో కలిపి 12 మిలియన్ల వ్యూస్‌, 400 వేల లైక్స్‌ను రాబట్టింది. దీంతో ఈ ట్రైలర్‌ ట్రెండింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు హిందీలో కూడా ఈ ట్రైలర్‌కు అదరిపోయే రెస్పాన్స్‌ రావడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూవీ నుంచి విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన మూడో లిరికల్‌ సాంగ్‌ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే మారుమోగిపోతుంది. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.