ETV Bharat / entertainment

'భలే భలే' దర్శకుడితో నాని కొత్త సినిమా.. - నాని మారుతి సినిమా అప్డేట్స్​

Nani Maruti new movie: ఇటీవలే 'అంటే సుందరానికీ' చిత్రంతో అభిమానులను పలకరించిన నేచురల్​ స్టార్​ నాని.. మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారని తెలిసింది. గతంలో తనకు సూపర్​ హిట్​ అందించిన దర్శకుడు మారుతీతో ఓ మూవీ చేయనున్నారని టాక్​ వినిపిస్తోంది.

nani maruti film
నాని మారుతీ సినిమా
author img

By

Published : Jun 21, 2022, 9:54 AM IST

Nani Maruti new movie: నేచురల్​ స్టార్​ నాని వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఇటీవలే 'అంటే సుందరానికీ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారాయన. ఈ మూవీ మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే ఇప్పుడాయన మరో దర్శకుడిని లైన్​లో పెట్టినట్లు తెలిసింది. తనకు గతంలో సూపర్​హిట్​ అందించిన మారుతీతో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారట. ఇటీవలే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, స్టోరీ బాగుండటం వల్ల నాని పచ్చజెండా ఊపేశారని టాక్​ వినిపిస్తోంది.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి 'భలే భలే మగాడివోయ్'​ సూపర్​ హిట్​గా నిలిచింది. 2015లో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకోవడం సహా బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. నిజానికి ఈ చిత్రంతోనే నానికి మరింత పాపులారిటీ వచ్చింది. అందుకే తనకు ఇలాంటి మంచి హిట్​ ఇచ్చిన మారుతీతో మరో మూవీ చేసేందుకు నేచురల్​ స్టార్​ సిద్ధమయ్యారు.

అయితే మారుతి ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రభాస్​తో ఆయన చేయాల్సిన మూవీ సెట్స్​పైకి వెళ్లడానికి ఆలస్యం అవ్వనున్న నేపథ్యంలో ఈ గ్యాప్​లో దీన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక ఆయన దర్శక్వంలో గోపిచంద్​ హీరోగా తెరకెక్కిన 'పక్కా కమర్షియల్'​ రిలీజ్​కు సిద్ధమైంది. మరోవైపు నాని.. ప్రస్తుతం 'దసరా' చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: Heroines: అందమైన భామలు.. అదిరిపోయే యోగాసనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.