ETV Bharat / entertainment

హాలీవుడ్ స్థాయిలో 'హిట్​'వర్స్.. టీజర్ రిలీజ్ డేట్​ ఫిక్స్​​ - అడివిశేష్ హిట్​ వర్స్​

ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిట్​ 2పై సాలిడ్​ అప్డేట్​ను ఇచ్చింది మూవీటీమ్​. ఆ సంగతులు..

Adivi sesh  Hit 2 teaser update
హాలీవుడ్ స్థాయిలో 'హిట్​'వర్స్.. టీజర్ రిలీజ్ డేట్​ ఫిక్స్​​
author img

By

Published : Oct 31, 2022, 6:49 PM IST

టాలీవుడ్‌లో సస్పెన్స్ కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన విశ్వక్​ సేన్​ 'హిట్-ది ఫస్ట్ కేస్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో, ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ చిత్ర సీక్వెల్​ కోసం ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం హిట్​ మల్టీవర్స్​గా రూపొందనుందని కొంత కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అలానే మరోవైపు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తోనే 'హిట్ 2' మూవీపై ఆసక్తిని పెంచుతూ వచ్చిన చిత్రబృందం తాజాగా మరో సాలిడ్​ అప్డేట్ ఇచ్చింది. టీజర్​ రిలీజ్​ డేట్​ విషయాన్ని తెలుపుతూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఈ సినిమా దర్శకుడు శైలేష్.. హిట్​ చిత్రాన్ని మల్టీ వర్స్​గా తెరకెక్కించబోతున్నట్లు క్లారిటీ చేశారు. వైవిధ్యంగా 'హిట్ వర్స్' అనే ప్రపంచాన్ని ప్రేక్షకులకు వివరించారు. హిట్-1, హిట్-2 చిత్రాల గురించి చెబుతూ ప్రేక్షకుల్లో ఈ మల్టీవర్స్​పై ఆసక్తిని రేకెత్తించారు. ఇక హిట్-3 గురించి కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, హీరో అడివి శేష్ వచ్చి.. హిట్ 2 రిలీజ్ కాకుండానే, హిట్ 3 గురించి చెప్పేస్తావా అంటూ అడ్డుకున్నారు. దీంతో హిట్-2 టీజర్ డేట్ ఎప్పుడో చెప్పేయమని హీరో అడగ్గా.. నవంబర్ 3న హిట్-2 టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర డైరెక్టర్ ప్రకటించాడు. ఈ వీడియోను చూస్తుంటే ఈ హిట్​ వర్స్​ హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.

కాగా, రెండో భాగంలో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా.. ఎంఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక డిసెంబర్ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆ సన్నివేశం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా: జాన్వీ కపూర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.