నందమూరి నటసింహం బాలకృష్ణ విశ్వరూపాన్ని వెండితెరపై చూశాం. ఆయన నటనలోని వేరియేషన్స్ బాలయ్యను అందలమెక్కించాయి. నందమూరి వారసుడిగా, సీనియర్ స్టార్ హీరోగా అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఓటీటీ వేదికపై అన్స్టాప్బుల్తో అంతకుమించి క్రేజ్ దక్కించుకున్నారు. 'చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరగరాయాలన్న మేమే' అంటూ 'సింహా'లో ఆయన చెప్పిన డైలాగ్ అన్‌స్టాపబుల్ షోకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంతో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైనస్టైల్ మేనరిజంతో ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ టాక్ షో.. అన్ని టాక్ షోలలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. సెలబ్రిటీలతో బాలయ్య ముచ్చటించిన తీరు, సరదా సెటైర్లు, పంచ్‌లు.. ఆయన లుక్, స్టైల్, మ్యానరిజం అన్ని షోకు మేజర్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అందుకే ఆయన హోస్ట్‌గా భారీ రేంజ్లో సక్సెస్ అయి మరింత క్రేజ్‌ను దక్కించుకున్నారు. అయితే ఆ సక్సెస్‌లో బాలయ్య రెండో కూతురు నందమూరి తేజశ్విని కూడా కీలక పాత్ర పోషించారు.
క్రియేటివ్ కన్సల్టెంట్‌గా.. సాధారణంగా బయట, మీడియాలో చాలా తక్కువగా కనిపించే ఈమె తన తండ్రిని ఓటీటీ వేదికపై విజయవంతమైన హోస్ట్‌గా, స్పెషల్ అట్రాక్షన్‌గా చూపించడానికి చాలా కష్టపడ్డారు. తన ప్రతిభకు బాలయ్య నటనను జోడించి షోను అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేలా చేశారు. నిజానికి ఈ షో కోసం చాలా మందే పనిచేశారు. అందులో తేజశ్వినితో పాటు సీనియర్ రైటర్ బీవీఎస్ రవి కూడా ఉన్నారు. ఆయనే స్వయంగా.. బాలయ్య విజయంలో తేజశ్విని పోషించిన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి సీజన్ కోసం ఆమె ఎంతలా కష్టపడ్డారో కూడా వివరించారు. బాలయ్య లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో తేజశ్విని చాలా రీసెర్చ్ చేశారని తెలిపారు. ఆ క్రెడిట్ ఆమెకే వెళ్తుందని చెప్పారు! "ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. మా డిస్కషన్స్‌లో చురుగ్గా పాల్గొనేవారు. బాలయ్య లుక్స్, కాస్ట్యూమ్స్.. ఇక స్క్రిప్ట్ విషయాల్లో తానే చొరవ తీసుకుని సలహాలు ఇస్తూ మాతో పాటు వర్క్ చేశారు" అని బీవీఎస్ పేర్కొన్నారు.
రెండో సీజన్ కోసం.. అన్‌స్టాపబుల్ తొలి సీజన్ సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత రెండో సీజన్ కోసం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆ ఎదురుచూపులకు తెరదించుతూ ఇటీవలే అక్టోబర్ 14నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. దానికి తగ్గట్టే షోకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. షోపై మరింత ఆసక్తిని పెంచేందుకు వరుసగా బాలయ్య లుక్స్, పోస్టర్స్, షోకు సంబంధించిన యాంథమ్, తొలి ఎపిసోడ్ ప్రోమో వంటి విడుదల చేశారు. అవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రోమోలో బాలయ్య డైలాగ్స్, లుక్స్, ఎనర్జీ చూసి మరింత ఆశ్చర్యపోయారు ఆడియెన్స్.
అయితే తాజాగా ప్రోమోకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య షో కోసం ఎంతలా కష్టపడ్డారు, సన్నివేశాలు ఎలా తెరకెక్కించారు వంటివి చూపించారు. అయితే ఈ ప్రోమోలో బాలయ్యతో పాటు మరో వ్యక్తి కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. ఎవరంటే మన నందమూరి తేజశ్వినీనే. తొలి సీజన్ కోసం ఎంతో చురుగ్గా పని చేసిన ఆమె రెండో సీజన్ కోసం కూడా క్రియేటవ్ కన్స్ల్టెంట్గా అంతే చురుగ్గా పనిచేశారు. తండ్రికి ఎలాంటి లుక్స్, గెటప్స్, క్యాస్ట్యూమ్స్ సెట్ అవుతాయి సహా షోకు సంబంధించిన మిగతా విషయాల్లోనూ చురుగ్గా పర్యవేక్షిస్తూ కనిపించారు. ఇక ఈ మేకింగ్ వీడియో చూసిన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తొలి ఎపిసోడ్ గ్రాండ్‌గా.. ఇక తొలి ఎపిసోడ్‌కు చీఫ్ గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేశ్ వచ్చారు. అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మొదటి ఎపిసోడ్ ప్రోమో విడదలై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో చంద్రబాబును బాలకృష్ణ అద్భుత ఇంట్రడక్షన్ ఇచ్చి షోలోకి ఆహ్వానించారు. తన ఎనర్జీతో ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ఈ ప్రోమో ఇప్పటివరకు 2.1కుపైగా మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని సోషల్‌మీడియాలో దూసుకుపోతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఈ కాంబో రిపీట్ అయితే సామిరంగా