ETV Bharat / entertainment

ఆర్టీసీ క్రాస్​రోడ్​ థియేటర్​లో 'నమ్రత' సందడి- ది వారియర్‌ టీజర్‌ చూశారా? - the warrior movie release date

'సర్కారు వారి పాట' చిత్రం ప్రదర్శితమవుతున్న ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని సుదర్శన్ థియేటర్​లో మహేశ్ బాబు సతీమణి నమత్రా శిరోద్కర్ సందడి చేశారు. కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసిన ఆమె... అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. అలాగే రామ్‌ హీరోగా నటించిన చిత్రం 'ది వారియర్‌' టీజర్​​ విడుదలై ఆకట్టుకుంటోంది.

Namratha at RTC Cross Road Theater
క్రాస్ రోడ్​ థియేటర్​లో 'నమ్రత' సందడి
author img

By

Published : May 14, 2022, 7:52 PM IST

Updated : May 14, 2022, 10:52 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమత్రా శిరోద్కర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్​లో సందడి చేశారు. 'సర్కారు వారి పాట' చిత్రం ప్రదర్శితమవుతున్న సుదర్శన్ థియేటర్ కు పలువురు కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసిన ఆమె.. అభిమానులతో కలిసి ఆసాంతం సినిమాను వీక్షించారు. ప్రేక్షకుల ఈలలు, గోలల మధ్య సినిమాను ఆస్వాదిస్తూ మురిసిపోయారు. అనంతరం మహేశ్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన కేక్​ను కట్ చేసి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నమత్రతోపాటు దర్శక నిర్మాతలు పరుశురాం, రవిలు హాజరై ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారిగా నమత్రా ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని థియేటర్​లో సినిమా చూడటానికి రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని మహేశ్ బాబు కు జేజేలు కొట్టారు.

'ది వారియర్‌' టీజర్​...

'మైడియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌ వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్‌ వార్నింగ్‌ అంటున్నారు యువ కథానాయకుడు రామ్‌. లింగు స్వామి దర్శకత్వంలో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'ది వారియర్‌'. ఆదివారం రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు చిత్ర బృందం కానుక ఇచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో రామ్‌ ఇంతకుముందెన్నడూ చేయని ఫుల్‌ మాస్‌ పోలీస్‌పాత్రలో కనిపించారు. రామ్‌కు దీటుగా ఆది ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్జే విజిల్‌ మహాలక్ష్మి పాత్రలో కృతిశెట్టి నటిస్తోంది. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పోర్న్​ ఇండస్ట్రీని ఏలిన ఈ శృంగార తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

Last Updated : May 14, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.