ETV Bharat / entertainment

తొలిసారి అలాంటి పని చేసిన మహేశ్ కొడుకు.. చెప్పలేనంత బాధగా ఉందన్న నమ్రత - మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్​ ఎమోషనల్

తన తనయుడు గౌతమ్​ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు సూపర్​ స్టార్​ మహేశ్‌బాబు భార్య సతీమణి నమ్రత శిరోద్కర్. అతడి విషయంలో చాలా బాధ పడుతున్నట్లు చెప్పారు. అసలేం జరిగిందంటే..

Namrata sirodkar post viral
మహేశ్​ భార్య ఎమోషనల్​ పోస్ట్​.. కొడుకు విషయంలో ఎంతో దిగులుగా ఉందంటూ..
author img

By

Published : Jan 21, 2023, 10:57 AM IST

సూపర్ స్టార్ మహేశ్​ బాబు తనయుడు గౌతమ్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో సైలెంట్‌గానే ఉన్నా.. మహేశ్​ కొడుకుగా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అప్పుడప్పుడు మహేశ్​ భార్య నమ్రత షేర్ చేసే పోస్ట్​ల ద్వారానే గౌతమ్ గురించి తెలుస్తుంటుంది. అయితే తాజాగా నమ్రత.. గౌతమ్​ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. గౌతమ్​ విషయంలో తనకెంతో బాధగా ఉందని చెప్పారు. వెలితిగా ఉందని కూడా చెప్పుకొచ్చారు.

"కల్చరల్‌ ట్రిప్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి.. సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది. రోజంతా శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. గూడును వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ప్రయాణం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా' అని నమ్రత పేర్కొన్నారు.

Namrata sirodkar post viral
నమ్రత ఎమోషనల్​

ఇదీ చూడండి: యాంకర్ రష్మి ఇంట విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.